కొబ్బరి నీళ్లు Vs మజ్జిగ - రెండింటిలో వేసవిలో ఏది బెస్ట్..!!
వేసవిలో ఎండలు పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతకు శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. ఈ సమయంలో వేడి తీవ్రత తట్టుకోవడానికి నిమ్మ రసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, కర్బూజా జ్యూస్ తీసు కోవడం చాలా మంచిది. వేసవి కాలంలో మజ్జిగ, కొబ్బరి నీళ్లకు చాలా ప్రాధాన్యతనిస్తారు. మరి ఈ రెండింటిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఏవి ఉంచుతాయనే అంశంలో పలువురిలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవి రెండూ కూడా శరీరానికి మంచివే అయినప్పటికీ ఈ రెండు పానీయాల పోషక విలువలు, వాటిని తీసుకునే సమయం ఆధారంగా శరీరానికి కలిగే లాభాలు ఉంటాయని నిపుణు లు చెబుతున్నారు.
వేసవిలో కొబ్బరి నీరు తాజాగా తీసుకుంటేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. దీన్ని ఎక్కువసేపు నిల్వ ఉంచడం లేదా చల్లబరచడం వల్ల దాని ప్రభావం తగ్గుతుంది. మరోవైపు మజ్జిగలో జీలకర్ర, ఉప్పు, మిరియాలు వంటి పదార్థాలు కలిపితే దాని పోషక విలువలు, రుచి మరింత మెరుగు అవుతాయి. కొబ్బరి నీరు తక్కువ కేలరీలతో ఉండి, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా అందిస్తుంది. ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇది శరీరాన్ని వేగంగా హైడ్రేట్ చేస్తుంది. మజ్జిగ శరీరా నికి చల్లదనాన్ని అందించడంతో పాటు జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల ప్రోబయోటిక్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రెండు పానీయాలను సరైన సమయా ల్లో తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.

వేసవిలో శరీరానికి ప్రయోజనకరంగా
అదే విధంగా మజ్జిగ తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బయట నుంచి వచ్చినప్పుడు లేదా వ్యాయామం తర్వాత కొబ్బరి నీరు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీరు ఎనర్జీ డ్రింక్స్ కంటే శరీరానికి ఎక్కువగా మేలు చేస్తుంది. రోజువారీ హైడ్రేషన్ కోసం ఈ రెండు పానీయాలను మారుస్తూ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ప్రతి పానీయం శరీరంలో వేర్వేరు విధంగా పనిచేస్తూ అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇక వేసవిలో ఈ పానీయాలను వివిధ రకాలుగా తీసుకోవచ్చు. జీలకర్ర, పుదీనాతో మజ్జిగ తయారు చేస్తే చల్లదనంతో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కొబ్బరి నీటిలో నిమ్మరసం కలిపితే విటమిన్ C పెరుగుతుంది. కొబ్బరి నీరు, మజ్జిగ రెండూ శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే వీటిని సరైన విధానంలో పరిమితంగా తీసుకోవటం ద్వారా వేసవిలో అవసరమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications