నవరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారి దర్శనం పై TTD కీలక నిర్ణయాలు..!!

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్త జనం తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో.. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సాలికట్ల బ్రహ్మోత్సవాల అనుభవాలను పరిగణలోకి తీసుకొని నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ నిర్ణయించింది. అదే విధంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ బ్రహ్మోత్సవాల వేళ దర్శనాల విషయంలోనూ అవసరమైన మార్పులకు సమాయత్తం అవుతోంది.

తిరుమలలో నవరాత్ర బ్రహ్మోత్సవాల పైన టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా యని, సాలకట్ల బ్రహ్మోత్సవాలు పూర్తయిన నేపథ్యంలో కేవలం 17 రోజుల వ్యవధిలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో వివిధ విభాగాల పనితీరుపై సేకరించిన ఫీడ్‌బ్యాక్, చెక్‌లిస్ట్‌లను విభాగాల వారీగా సమీక్షించి, ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్దడంతోపాటు మరింత మెరుగైన సమన్వయం కోసం చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌లో అన్నప్రసాదం, విద్యుత్ అలంకరణ, పుష్పాలంకరణతోపాటు పలు విభాగాల్లో 95 నుంచి 98 శాతం వరకు సంతృప్తి వ్యక్తమైనట్లు తెలిపారు. ఇదే అనుభవంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌ పై TTD కీలక ప్రకటన, భారీ డిమాండ్ తో..!!
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌ పై TTD కీలక ప్రకటన, భారీ డిమాండ్ తో..!!
ttd-aeo-venkaiah-chowdary-calls-for-successful-conduct-of-navaratri-brahmotsavams-here-the-details

సామాన్య భక్తులకు ప్రాధాన్యత

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పూర్తిస్థాయిలో సెలవులు ఉండటం వల్ల గత బ్రహ్మోత్సవాలతో పోలిస్తే మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల భక్తుల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని అదనంగా సుమారు 20 శాతం భక్తుల రాకను అంచనా వేస్తూ అన్నప్రసాదం, అవసరమైన సామగ్రి, ప్రొక్యూర్‌మెంట్, స్టాకింగ్, రవాణా, లాజిస్టిక్స్ తదితర అంశాల్లో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సామాన్య భక్తుల సర్వ దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు వీఐపీ, ప్రివిలేజ్ దర్శనాలు, సీనియర్ సిటిజన్లు, చిన్న పిల్లలు, శ్రీవాణి, ఎస్‌ఈడీ తదితర దర్శనాల విషయంలో అవసరమైన నియంత్రణలు చేపట్టినట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి కొన్ని దర్శనాలను తగ్గించడం లేదా రద్దు చేయడం ద్వారా సర్వ దర్శన భక్తులకు వేచి ఉండే సమయాన్ని తగ్గించే విధానాన్ని నవరాత్రి బ్రహ్మోత్సవాల్లోనూ కొనసాగించనున్నట్లు చెప్పారు. మూలమూర్తి దర్శనంతోపాటు వాహనసేవలను కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వీక్షించే అవకాశం కల్పించేందుకు రెండింటినీ సమన్వయం చేస్తూ మ్యాన్‌పవర్, ఇతర వనరులను సమర్థవంతంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+