మోకాలినొప్పికి క్యాబేజీ ఆకుల ట్రీట్‌మెంట్.. పని చేస్తుందా?
ప్రస్తుతం చాలామంది మోకాలి నొప్పి సమస్య తో బాగా బాధపడుతున్నారు. మోకాళ్ళ నొప్పి సమస్యకు పరిష్కారంగా పిఆర్పి ఇంజక్షన్లను చేయించుకుంటున్నారు. మోకాళ్లలో కొల్లాజిన్ తగ్గిపోవడం వల్ల కీళ్ల మధ్య రాపిడి జరిగి లూబ్రికేట్ లేక మోకాలు నొప్పి వస్తుంది. కీళ్ల వద్ద వాపు రావడం, నడవలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇక ఈ సమస్యల పరిష్కారానికి వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు.
క్యాబేజీ ఆకులతో మోకాలు నొప్పి ట్రీట్మెంట్ వర్కౌట్ అవుతుందా?
అయితే మరికొందరు ఇంటి చిట్కాలను కూడా పాటిస్తున్నారు. మోకాలు నొప్పిని తగ్గించుకోవడానికి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఇంటి చిట్కాలలో క్యాబేజీ ఆకులతో ప్యాక్ చేయడం ఒకటి. అసలు క్యాబేజీ ఆకులతో మోకాలు నొప్పి కోసం చేసే ట్రీట్మెంట్ వర్కౌట్ అవుతుందా? వైద్యులు ఏం చెప్తున్నారు? అనేది ఒకసారి తెలుసుకుందాం.

క్యాబేజ్ ఆకులతో ప్యాక్ ఇలా
మోకాలు నొప్పి కోసం చాలామంది ఇంట్లోనే క్యాబేజీ ఆకులతో మోకాలికి ప్యాక్ వేస్తున్నారు. క్యాబేజీ ఆకులను తీసి, వాటిని మెత్తబడేలా బాగా రుద్ది ఆ పైన మోకాలి పైన ఆకులు పెట్టి, కాటన్ క్లాత్ తో కానీ, బ్యాండేజ్ తో కానీ కట్టు కట్టాలి. కనీసం అరగంట నుంచి గంట పాటు, లేదా రాత్రంతా అలానే దానిని ఉంచాలి.
మోకాలు వాపు తగ్గించే క్యాబేజీ ఆకులు
రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు ఇలా చేయడం వల్ల కొద్దిగా మోకాలు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. క్యాబేజీ ఆకుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మోకాలు వాపు తగ్గించడంలోనూ, రక్త ప్రసరణ మెరుగుపరచటం లోను, మోకాలు స్టిఫ్నెస్ తగ్గించి, ఫ్రీగా నడవడానికి సహాయపడతాయి. అయితే క్యాబేజీ ఆకులతో మోకాలు నొప్పికి కలిగే ఉపశమనం తాత్కాలిక ఉపశమనం మాత్రమే.
మోకాలి నొప్పికి శాశ్వత పరిష్కారమేనా?
అది మోకాలు నొప్పికి శాశ్వతమైన పరిష్కారం కాదు. కనుక ఆర్థరైటిస్ తో బాధపడేవారు నొప్పి కాస్త రిలీఫ్ కావాలంటే క్యాబేజీ ఆకులను ఉపయోగించవచ్చు కానీ, కచ్చితంగా వైద్యుని సంప్రదించ వలసిందే. ఇక కొంతమందికి క్యాబేజీ ఆకులతో అలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి, అటువంటి సమస్య ఉంటే క్యాబేజీ ఆకులతో కట్టుకట్టడం కూడా మంచిది కాదు












Click it and Unblock the Notifications