క్యారెట్, ఆరెంజ్, అల్లం..హెల్త్ షాట్: డైలీ ఓ రెండు గుక్కలు తీసుకుంటే చాలు..!!

ఆరెంజ్, అల్లం కలిపిన 'హెల్త్ షాట్’ గురించి చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనేది నిపుణుల మాట. ఇంట్లో తాజాగా తయారు చేసుకునే ఈ జ్యూస్ ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం. క్యారెట్, ఆరెంజ్, పచ్చి అల్లంతో తయారు చేస్తారు. క్యారెట్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అయిన బీటా-కెరోటిన్‌ను అందిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

ఆరెంజ్‌..

ఆరెజ్..విటమిన్ సీ, ఫ్లేవనాయిడ్స్‌కు గొప్ప వనరు. ఫ్లేవనాయిడ్స్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన మొక్కల సమ్మేళనాలు. ఇవి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని హెల్త్‌లైన్ నివేదించింది.

Carrot Orange And Ginger Health Shot For Immunity And Digestion Natural Health and boost Immunity

క్యారెట్..

క్యారెట్‌లో బీటా-కెరోటిన్ పుష్కలం. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీనివల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

పచ్చి అల్లం..

పచ్చి అల్లం జింజెరాల్‌ను అందిస్తుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. 'అడ్వాన్సెస్ ఇన్ ఎక్స్‌పెరిమెంటల్ మెడిసిన్ అండ్ బయాలజీ' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ-ట్యూమర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది.

ఈ మూడింటినీ కలిపి ఇంట్లో తాజాగా తయారుచేసిన జ్యూస్ షాట్‌లు ఆరోగ్యానికి బూస్టర్‌గా పని చేస్తాయని కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించారు. ఈ షాట్‌ను తయారుచేయడం వలన చాలావరకు ఫైబర్ కంటెంట్ తొలగిపోతుందని, అందువల్ల, దీనిని ఒక ఫంక్షనల్ షాట్‌గా చిన్న భాగాలలో మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడూ భోజనానికి ప్రత్యామ్నాయంగా పరిగణించకూడదని వివరించారు.

క్యారెట్- ఆరెంజ్- అల్లం షాట్ రెసిపీకి కావలసినవి: చిన్న ముక్కలుగా కోసిన రెండు క్యారెట్‌లు, సగానికి కోసిన ఆరెంజ్, తాజా అల్లం ముక్కలు.

తయారీ విధానం: ఈ పదార్థాలను అవసరమైనంత నీటితో జ్యూస్ చేయాలి లేదా బ్లెండ్ చేసి, వడకట్టాలి. ఈ రెసిపీ మూడు నుండి నాలుగు చిన్న షాట్‌లను ఇస్తుంది. ఒక్కొక్కటి సుమారు 30 నుండి 50 మిల్లీ లీటర్లు. ఉంటుంది. ఈ పానీయాన్ని తాజాగా తీసుకోవచ్చు, మూడు రోజుల వరకు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవచ్చు. పండ్లు, కూరగాయలు, ప్రొటీన్, ధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారంలో నారింజ, అల్లం షాట్‌లను చేర్చడం, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

Disclaimer: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఈ కథనం సోషల్ మీడియా నుండి సేకరించినది. దీనికి గురించి మరింత తెలుసుకోవడానికి డాక్టర్లు/డైటీషియన్లను సంప్రదించవచ్చు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+