చింతచిగురు కోడిగుడ్డు కూర..సూపర్ టేస్ట్ తో పాటు ఆరోగ్యం కూడా!

చింతచిగురు రొయ్యల కూర ఎలా ఉంటుందో తిన్న ప్రతీ ఒక్కరికి తెలిసే ఉంటుంది. అయితే చింత చిగురుతో మనం రకరకాల కూరలు వండి రుచి చూడవచ్చు. అలాంటి కూరలలో చింతచిగురు కోడిగుడ్ల కూర ఒకటి. ఈ కూర ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. రుచికరమైన, ఆరోగ్యకరమైన ఈ వంటకాన్ని సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కూర తయారీకి కావలసిన పదార్థాలు

నాలుగు ఉడికించిన కోడిగుడ్లు,

రెండు కప్పుల చింతచిగురు,

మూడు ఉల్లిపాయలు,

రెండు టమాటాలు,

నాలుగు పచ్చిమిర్చి,

ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్.

ఒక టేబుల్ స్పూన్ కారం,

అర టేబుల్ స్పూన్ పసుపు,

ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి,

అర టేబుల్ స్పూన్ జీలకర్ర,

అర టేబుల్ స్పూన్ ఆవాలు,

2 కరివేపాకు రెమ్మలు,

కొత్తిమీర,

మూడు టేబుల్ స్పూన్ల నూనె,

రుచికి సరిపడా ఉప్పు

Chintachiguru Egg Curry is a special dish make in this process for super taste and good health

తయారీ విధానం

మొదటగా, కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి పాన్ లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, పది కరివేపాకు రెమ్మలు వేసి అవి చిటపటలాడే వరకు వేయించాలి. ఈ పోపు మంచి సువాసనను అందిస్తుంది.

చింతచిగురు ఎగ్ కూర ప్రాసెస్ ఇలా

ఆ తర్వాత, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు చక్కగా వేయించాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి, దాని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారగానే, తరిగిన టమాటాలను చేర్చి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.

ఇవన్నీ వేస్తేనే కూరకు టేస్ట్

టమాటాలు బాగా మగ్గిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి అన్ని పదార్థాలు కలిసేలా బాగా గరిటెతో తిప్పాలి. ఆపై ముందుగా కడిగి సిద్ధం చేసుకున్న చింతచిగురును వేసి, మూతపెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి.

7 రకాల కూరగాయలతో సాంబార్ రైస్.. సూపర్ టేస్టీ, హెల్దీ!
7 రకాల కూరగాయలతో సాంబార్ రైస్.. సూపర్ టేస్టీ, హెల్దీ!

రుచికరమైన ఎగ్ చింతచిగురు రెడీ

చింత చిగురు మెత్తబడితేనే కూరకు నిజమైన రుచి వస్తుంది. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లు, అవసరమైతే కొద్దిగా నీళ్లు చేర్చి, మరో పది నిమిషాలు సన్నటి మంటపై మగ్గనివ్వాలి. కొత్తిమీర చల్లి స్టవ్ ఆపి వేడివేడిగా వడ్డించుకోవాలి. అంతే రుచికరమైన ఎగ్ చింతచిగురు రెడీ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+