పరగడుపునే తాగండి... డాక్టర్ అవసరమే రాదు
మన ఇంట్లో వంటగదిలో ఉండే పదార్థాలను సరిగా ఉపయోగించుకుంటే డాక్టర్ అవసరమే రాదని ఆయుర్వేద వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఎవరూ వాటిగురించి పట్టించుకోకుండా ఇంగ్లిషు మందుల వెంట పరుగులు తీస్తుంటారు. వంటగదిలో పోపుల పెట్టెలో ఉండే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. వంటకు ఘాటు తీసుకురావడంతోపాటు రుచిని కూడా కలగజేస్తుంది. దాల్చిన చెక్క వేయడంవల్ల వంటల్లో రుచి పెరుగుతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉన్నాయి. దాల్చిన చెక్కను ఎలా వాడితే ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.
ప్రతిరోజు ఉదయం పరగడుపునే దాల్చిన చెక్క నీటిని తాగుతుండాలి. దీనివల్ల అనేకరకాల అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటమే కాకుండా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరస్ ల వల్ల వచ్చే వ్యాధులను తగ్గిస్తుంది.

బరువు తగ్గాలనకునేవారు పరగడుపునే దాల్చిన చెక్క నీటిని తీసుకోవడంవల్ల సులువుగా బరువు తగ్గుతారు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండటమే కాకుండా వ్యాయామం చేసిన తర్వాత తాగితే కండరాలు విశ్రాంతికి గురవుతాయి. స్త్రీలల్లో హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అజీర్తి సమస్య దూరమవడమే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. పంటి సమస్యలు దూరమవుతాయి. ఇంకా అనేక ప్రయోజనాలున్నాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరగడుపునే దాల్చిన చెక్కనీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications