ఫుడ్ డెలివరీ యాప్స్ కు కాలం చెల్లిందా ? వీటికే ఇప్పుడు డిమాండ్..! ట్రై చేశారా ?
ఆటోమేటిక్ చాట్ బోట్స్ కంటే వాస్తవంగా వ్యక్తులతో మాట్లాడి తమకు కావాల్సిన ఆహారం ఆర్డర్ చేసుకునే అవకాశం దొరికితే ఎవరు వద్దంటారు.? ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో క్లౌడ్ కిచెన్స్ డిమాండ్ పెరుగుతోంది.
భారత్ లో కొన్నేళ్లుగా ఫుడ్ డెలివరీ యాప్స్ కు ఆదరణ పెరుగుతూ వస్తోంది. స్విగ్గీ, జొమాటో, ఉబెల్ వంటి యాప్స్ గురించి ఇప్పుడు దేశంలోని తెలియని వారే లేరు. అలాగే హోటల్ పరిశ్రమ కూడా వీటి సేవల్ని విస్తృతంగా వాడుకుంటోంది. కానీ ఇప్పుడు ఈ యాప్స్ ను సైతం వెనక్కి నెట్టేసిన వాటి స్ధానాన్ని ఆక్రమించేందుకు మరో కొత్త కాన్సెప్ట్ దూసుకొస్తోంది. దేశంలో పలు నగరాల్లో ఇప్పుడు దీనికి ఆదరణ పెరుగుతోంది.
ఫుడ్ డెలివరీ యాప్స్ సేవలు ఇటు ఆహార ప్రియులకు, అటు హోటల్ పరిశ్రమకూ ఉపయోగపడుతున్నా.. అంతిమంగా సేవల్లో లోపాలు మాత్రం పెరిగిపోతున్నాయి. అదే సమయంలో ఈ యాప్స్ వాడుతున్న ఆటోమేటిక్ చాట్ బోట్స్ కంటే వాస్తవంగా వ్యక్తులతో మాట్లాడి తమకు కావాల్సిన ఆహారం ఆర్డర్ చేసుకునే అవకాశం దొరికితే ఎవరు వద్దంటారు.? ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో క్లౌడ్ కిచెన్స్ డిమాండ్ పెరుగుతోంది.

ఈ మానవ అనుబంధమే క్లౌడ్ కిచెన్‌లు ఇంతగా ప్రాచుర్యం పొందడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా కనిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మనం చూస్తున్న ఫుడ్ రీల్స్ తో ఎక్కువగా కనెక్ట్ అయ్యే పరిస్ధితి ఉంది. ఇందులో నేరుగా ఆయా రీల్స్ పెడుతున్న వారితో మాట్లాడి క్లౌడ్ కిచెన్ ద్వారా మనకు కావాల్సిన ఆహారాన్ని తక్కువ ఖర్చులో ఇంటికి తెప్పించుకునే అవకాశం ఉండటం ప్రత్యేకతగా మారుతోంది. క్లౌడ్ కిచెన్స్ లేదా ఘోస్ట్ కిచెన్స్ గా నిర్వహిస్తున్న వాటి గురించి ఫుడ్ రీల్స్ చేయడం, అందులో కనిపించే ఫుడ్ కావాలంటే నేరుగా డీఎం చేయమనే మెసేజ్ లు ఆహార ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి.

దీంతో దేశవ్యాప్తంగా క్లౌడ్ కిచెన్‌ల సంఖ్య కూడా పెరుగుతోంది. గౌర్మెట్ బర్గర్‌లు, ఆర్టిసానల్ డెజర్ట్‌ల నుండి సాధారణ ఘర్ కీ కిచ్డీ వరకు స్వదేశీ చెఫ్‌లు ప్రతిదీ వండుతూ ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఇందులో అందుబాటులో ఉన్న చాలా ఆహార పదార్ధాలు డెలివరీ యాప్స్ లో కనిపించవు. అలాగే క్లౌడ్ కిచెన్స్ పూర్తిగా వాట్సాప్ , ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, కామెంట్‌లు, చాట్‌లు డీఎంల ద్వారా నడుస్తున్నాయి. కరోనా సమయంలో మొదలైన ఈ కాన్సెప్ట్ ఇప్పుడు దేశంలో అంతకంతకూ ఆదరణ పెంచుకుంటోంది.












Click it and Unblock the Notifications