అదే పనిగా కొబ్బరిని వాడుతున్నారా?
కొబ్బరితో చేసే వంటకాలు చాలామందికి ఇష్టం. అవి స్నాక్స్ అయినా, కూరలైనా. నాన్ వెజ్ లో కొబ్బరి పొడి మిక్స్ చేయడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. ఒక్క నాన్ వెజ్ అనే కాకుండా కొబ్బరి పొడి కలిపిన చాలా వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అందుకే వీటికి మంచి ఆదరణ ఉంది. ఆధునిక కాలంలో కొలెస్ట్రాల్ వంటి ఇబ్బందులు తలెత్తుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొబ్బరిని కూరల్లో విస్తృతంగా వినియోగించవచ్చా? లేదా అనే అనుమానాలు కలుగుతుంటాయి.
సాధారణంగా కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి వంటకాల్లో నూనె వాడకాన్ని తగ్గించమని చెబుతుంటారు. ఇక్కడే చాలా మందికి కొబ్బరి విషయంలో సందేహం కలుగుతుంది. దీన్ని వంటకాల్లో వాడితే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అనేది చాలామందికి అనుమానం. ఎందుకంటే ఇందులో నూనె ఉంటుంది కాబట్టి.

నిజానికి- కొబ్బరి, కొబ్బరి తురుము, కొబ్బరి పొడి వంటివి వంటకాల్లో వినియోగించవచ్చు. ఇందులో ఉండే ఫినాల్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించి కణాలకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. తద్వారా అధిక కొలెస్ట్రాల్ వచ్చే అవకాశాలను నివారిస్తుంది. కొబ్బరిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. కొబ్బరి నుంచి తీసిన నూనెకు కూడా ఈ గుణం ఉంటుంది. దీన్ని ఎలా ఉపయోగిస్తారన్నది ముఖ్యం.
వేపుడు వంటి వంటకాల్లో కొబ్బరి తురుము లేదా కొబ్బరి నూనె వాడినప్పుడు.. అది దాని గుణాన్ని కోల్పోతుంది. ఫ్రై లాంటివి కాకుండా ఇతర వంటకాల్లో ఉపయోగించినప్పుడే అందులో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. ఆ కొబ్బరి తురుము, కొబ్బరి పొడి, కొబ్బరి నూనెను సరైన పద్ధతిలో ఉపయోగించడం కొలెస్ట్రాల్ కు కారణం అయ్యే ఆమ్లాల ఉత్పత్తిని అడ్డుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ ను తొలగించవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ నియంత్రించడానికి ఉపయోగపడేవే.
కొబ్బరిని సరైన మోతాదులో తీసుకుంటే బెటర్. దీన్ని గ్రైండ్ చేసి కూరల్లో కలుపుకోవచ్చు. కొబ్బరి తురుమును వేపుడు కూరల్లో ఉపయోగించడం మంచిది కాదు. దీనివల్ల అది సహజ గుణాలను కోల్పోతుంది. కొబ్బరిని వేయించినప్పుడు, దానిలోని నీటి శాతాన్ని కోల్పోతుంది. ఫలితంగా పాలిసైక్లిక్ హైడ్రోకార్బన్లు ఏర్పడతాయి. అది కార్బన్ కాంబినేషన్ అవుతుంది. దీనివల్ల అసిడిటీ, గుండెల్లో మంట, ప్రేగు సమస్యలను తలెత్తుతాయి.
వేయించి, గ్రైండ్ చేసి ఉపయోగించడం వల్ల కొబ్బరి కొలెస్ట్రాల్ వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. ఫ్రైలో కొబ్బరి తురుము వేస్తే వంటకాలు రుచిగా ఉన్నప్పటికీ, ఇలాంటివి వీలైనంతవరకు నివారించాలి. రుచి కోసం చూసుకుంటే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. కొబ్బరి పాలను కూడా వంటకాల్లో వాడొచ్చు. వీటితో తయారుచేసే కూరలకు మంచి టేస్ట్ వస్తుంది. కొబ్బరిని పాలుగా మార్చినప్పుడు, దానిలోని ఫైబర్ తగ్గుతుంది. లేత కొబ్బరి, కొబ్బరి నీరు, కొబ్బరి పానీయాలు అన్నీ ఆరోగ్యకరమైనవి.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
పాము పేగుల్లో అద్భుతం.. కొండచిలువ నుంచి వెయిట్ లాస్ సీక్రెట్! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications