కాఫీ, టీ లలో ఏది ఆరోగ్యానికి మంచిదంటే..

కాఫీ, టీ ఈ రెండింటిలో ఏది మంచిది? ఏది తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి? అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ప్రస్తుతం మనం కాఫీ, టీ రెండింటిలో ఏది మంచిది? దేనిలో ఎటువంటి గుణాలు ఉంటాయి? కాఫీ, టీ లను తాగేవారు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటి? అనేది తెలుసుకుందాం.

కాఫీ తాగితే జరిగేదిదే

కాఫీ, టీ రెండు దేనికవే ప్రత్యేకమైనవి. రెండు ప్రత్యేక ప్రయోజనాలను అందించేవి. అయితే వీటిని తీసుకునేవారిలో వారి జీవనశైలి, ఆరోగ్య లక్ష్యాలను బట్టి వారి ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. కాఫీలో అధికంగా కెఫిన్ ఉంటుంది. ఇది తక్షణ శక్తిని ఇచ్చి పనిలో వేగాన్ని పెంచుతుంది. కనుక బిజీబిజీగా పనిచేసేవారు కాఫీ తాగడానికి ఎక్కువ ఇష్టపడతారు.

coffee vs tea which is best for health let us know

కాఫీ అతిగా తాగితే ఈ ఇబ్బందులు

కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతే కాదు కాఫీ మన మెదడు చురుకుగా పనిచేయడానికి, ఏకాగ్రతను పెంచడానికి కూడా దోహదం చేస్తుంది. అయితే కాఫీ ని ఎక్కువగా తాగితే నిద్రలేమి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. కనుక కాఫీ తాగాలనుకుంటే పరిమిత మోతాదులో తాగడం చాలా అవసరం.

టీతో లాభ నష్టాలు ఇలా

చాలామంది టీ తాగడానికి ఇష్టపడతారు. ఎక్కువ సార్లు టీ తాగటం మంచిది కాదు. అయితే టీలో గ్రీన్ టీ చాలా మంచిది. గ్రీన్ టీలో క్యాటెచిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియను మెరుగుపరుస్తాయి. బరువు తగ్గడంలో దోహదం చేస్తాయి. టీ మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. ముఖ్యంగా హెర్బల్ టీలు మన జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. మంచి నిద్ర పట్టేలా చేస్తాయి.

కాఫీ, టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

ఇక కాఫీ, టీ రెండింటిలోనూ మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయం గుర్తించాలి. అయితే తక్షణ శక్తి కావాలనుకునే వారు కాఫీని, మానసిక ప్రశాంతత కావాలనుకునే వారు టీని తీసుకోవచ్చు. ఈ రెండు పానీయాలు శరీర ఆరోగ్యానికి సానుకూల ఫలితాలను ఇస్తాయి. అయితే కాఫీ కానీ, టీ కానీ తరచుగా ఎక్కువగా తాగడం మంచిది కాదు. తాగే పరిమాణాన్ని సమతుల్యం చేసుకుంటూ రెండింటినీ తీసుకోవడం మంచిదే. అయితే ఏది తీసుకున్న మితంగా తీసుకోవాలనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+