ఉదయాన్నే ఈ టీ తాగండి.. డాక్టర్ అవసరం లేదు
మొక్కజొన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటి రుచి అద్భుతం. దీంతో ఎన్నోరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. మొక్కజొన్న నుంచి వచ్చే పీచును బయట పడేస్తుంటారు. ఇందులో ఏం ఉండవని అనుకుంటారు. కానీ మొక్కజొన్న కండి కన్నా ఎక్కువ లాభాలు ఉంటాయని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. మొక్కజొన్న పీచుతో టీ ఎలా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం.
మొక్కజొన్న పీచుతో టీ తయారు చేసుకోవచ్చు. ఇందులో విటమిన్ బి2, విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం ఉంటాయి. మొక్కజొన్న పొట్టును తీసేసిన తర్వాత పీచును సేకరించాలి. మంచినీటితో దాన్ని కడిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. రెండు గ్లాసుల నీటిని పోసి బాగా మరిగించి ఆ తర్వాత టీని వడకట్టాలి. చివరగా వచ్చే టీని తాగొచ్చు. చేదుగా అనిపిస్తే తేనె కలుపుకోవచ్చు. పంచదార వాడకూడదు.

పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలోని విష వ్యర్థాలను బయటకు పంపించడంతోపాటు బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది. మొక్కజొన్న పీచులో ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మధుమేహ రోగులకు ఈ టీ బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అందులో ఉంచే ఇన్సులిన్ హార్మోన్ అందిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు పీచుతో చేసిన టీ తాగొచ్చు. జీర్ణక్రియ రేటు మెరుగవడంతోపాటు శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కూడా కరిగించేస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. వారానికి మూడు నుంచి ఐదుసార్లు టీని తీసుకుంటే చాలు. ఉదయం సమయంలో తీసుకుంటే ఎంతో మేలు చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications