శరవేగంగా వ్యాపిస్తోన్న కరోనా.. 'ఎరిస్ ' తో భయబ్రాంతులు
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి ఎంతటి విలయతాండం సృష్టించిందో కళ్లెదుటే చూశాం. ఆ భయంకరమైన అనుభవాల నుంచి ఇప్పుడిప్పుడే అందరూ తేరుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో కరోనాలో కొత్త వేరియంట్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. బ్రిటన్ లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎరిస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. కొవిడ్ మహమ్మారి మనల్ని వదిలివెళ్లలేదని అర్థమవుతోంది.
కరోనాలో ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ మానవాళికి ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. ఒమిక్రాన్ లో పుట్టుకొచ్చిన మరో కొత్త వేరియంట్ ఇంగ్లండ్ నుంచి వ్యాప్తి చెందుతోంది. ఈ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ వైద్య, ఆరోగ్యశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది. ప్రతి ఏడు కేసుల్లో ఒకటి ఎరిస్ గా నిలుస్తోంది. 4,396 శ్వాసకోశ నమూనాల్లో 5.4 శాతం కొవిడ్ 19 కేసులుగా గుర్తించారు. జులైలో ఎరిస్ కేసులు 11.8 శాతంగా ఉన్నాయి. తొలి కేసు జులై మూడున హోరిజోన్ స్కానింగ్‌లో బయటపడింది.

కరోనాకు సంబంధించి ఇప్పటివరకు 4722 సీక్వెన్సులు వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడిస్తోంది. వీటిల్లో చాలావరకు అంత తీవ్రత లేనివే. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ జాబితా నుంచి కొవిడ్ ను ఈ ఏడాది మే 5న తొలగించింది. ఆ తర్వాతే ఎరిస్ వేరియంట్ వెలుగుచూసింది.
దీని లక్షణాలు పూర్తిగా తెలియనప్పటికీ ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కంటే శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వేరియంట్ సోకినవారిలో శ్వాసకోశ సంబంధిత సమస్య తీవ్రంగా ఉంటోంది. ప్రజల్లో వ్యాధినిరోధక శక్తి తగ్గడం, వాతావరణం పూర్తిగా కలుషితం కావడం కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు కూడా కరోనాకు సంబంధించిన నిబంధనలను గాలికొదిలేయడంతో వ్యాధి ముప్పు తొలగిపోకుండా ఉంది.












Click it and Unblock the Notifications