పరగడపున ఈ నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?

ప్రస్తుతం చాలామంది ఆరోగ్యంపై అశ్రద్ధ వహిస్తున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో ఇంట్లో వండుకునే సమయంలేక బయటి ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. అలా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కారణంగా ఊబకాయం, షుగర్, బీపీ తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి వారు జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని మరుసటి రోజు పరగడుపున తాగాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. ఇలా తాగడం వల్ల బరువు తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుందని అలాగే శరీరంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని చెబుతున్నారు.

పరగడపున జీరా నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. జీరా నీరు గొంతు నొప్పిని తగ్గిస్తుందని.. క్యాన్సర్ ను నివారిస్తుందని వివరిస్తున్నారు. జీలకర్ర నీటిని పరగడపున తాగడం వల్ల కిడ్నీలను సంరక్షిస్తుందని.. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టిన తర్వాత ఈ నీటికి నిమ్మరసం కలిపి పరగడపున తాగితే శరీరంలోని టాక్సిన్లు బయటికి పోయి, పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

Cumin Water Magic Unlock Daily Health Benefits with One Simple Morning Ritual

అలాగే జీలకర్ర నీళ్లు ప్రతిరోజూ పరగడుపున తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్​ తగ్గి హృదయ సంబంధిత వ్యాధుల ముప్పును అరికడుతుంది. ఇక జీరా నీరు కడుపులో ఉన్న అసిడిటీని తగ్గిస్తుంది. అలాగే కడుపు ఉబ్బరాన్ని సైతం తగ్గిస్తుంది.. అని వైద్యులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు పరగడుపున జీరా వాటర్ తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాక జీరా నీళ్లు తాగడం వల్ల చర్మ నిగారింపు పెరుగుతుందని దాంతోపాటు జుట్టు కుదుళ్లు బలంగా, ప్రకాశవంతంగా తయారవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఊబకాయం, షుగర్ వ్యాధిగ్రస్థులు ఈ నీటిని తీసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. పరగడపున ఈ నీటిని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+