ఈ సాధారణ అలవాట్లతో ఆరోగ్యానికి డేంజర్... మార్చుకోకుంటే అంతే సంగతి!

చాలామంది ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు ఆరోగ్యకరమైన అలవాట్లను కూడా చేసుకోవాలి. కానీ మనకు తెలియకుండానే మనం అనేక అనారోగ్యకరమైన అలవాట్లను చేసుకుంటున్నాం. ఇవి మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. సైలెంట్ కిల్లర్ లాగా మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మరి అటువంటి అనారోగ్యకరమైన అలవాట్లను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

సాధారణంగా మన ఈ అలవాటుతో డేంజర్
మనలో చాలామంది రోజు కొన్ని పనులకు అలవాటు పడిపోయి ఉంటారు. అవి కాలక్రమేణా మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి. మన ఆరోగ్యాన్ని రహస్యంగా దెబ్బతీసే సాధారణమైన చెడు అలవాట్లను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. చాలామంది ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు దీర్ఘకాలికవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఎక్కువ సేపు కూర్చోవడం మంచిది కాదు.

Danger with these common habits If you don t change them you will face health issues

ఈ వినియోగం తగ్గించండి
చాలామంది ఆహారంలో అధికంగా చక్కెరను వినియోగిస్తూ ఉంటారు. దీనివల్ల ఊబకాయ బాధితులుగా మారుతారు. ఇన్సులిన్ నిరోధకత పెరగడంతో పాటు దంత క్షయం వంటి అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కనుక అధిక చక్కెర వినియోగం కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.

నిద్రలేమి సమస్యతో ఆరోగ్యానికి చేటు
చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడతారు. దీర్ఘకాలిక నిద్రలేమి వలన అనేక దీర్ఘకాలికమైన వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవాలని చెబుతున్నారు. ఇక చాలామంది పడుకునే ముందు స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు వంటి వాటిని వినియోగిస్తారు అయితే దీనివల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. ఫలితంగా ఆరోగ్యం పాడవుతుంది.

తక్కువ నీళ్ళు తాగటం కూడా ప్రమాదమే
ఇంకా కొంతమంది చాలా తక్కువగా నీటిని తాగుతూ ఉంటారు. మీరు తక్కువగా తాగడం కూడా మన శరీరానికి హాని చేస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధుల సంక్రమణ పెరుగుతుంది. ఇక సాధారణంగా పొరపాటుగా మనం పాటించే ఈ అలవాట్లు మానుకుంటే మంచిది. లేదంటే తీవ్ర ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+