జాగ్రత్త... ఉప్పుతో మధుమేహం వస్తోంది!!
షుగరు అనగానే బరువు ఎక్కువగా ఉండటం, జీవనశైలి అంతా బద్ధకంతో ఉండటం, కుటుంబంలో ఎవరికైనా షుగరు ఉండటం, కాలేయానికి కొవ్వు పట్టడం వంటివే గుర్తుకొస్తాయి. వీటికి అదనంగా ఉప్పు వాడేవారికి కూడా షుగరు వస్తోంది. అమెరికాలోని టులానే యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. షుగరు రాకూడదు అని కోరుకుంటుంటే.. అదనంగా ఉప్పును వాడటం మానుకోవాలి. ఉప్పువల్ల మధుమేహం ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దాదాపు నాలుగు లక్షల మంది ఆహారపు అలవాట్లను పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించారు.
అసలు ఉప్పు వేసుకోనివారు, అప్పుడప్పుడు ఉప్పు వేసుకునేవారు, ప్రతిసారీ ఉప్పు ఎక్కువగా వాడేవారిని పరిశీలించగా తినే ప్రతిసారీ ఉప్పు వేసుకునేవారికి మధుమేహం వచ్చే అవకాశాలున్నట్లు తేలింది. ఉప్పును తక్కువగా వాడుతుంటే గుండెజబ్బు, అధిక రక్తపోటు ముప్పుండదు. ఉప్పు తక్కువగా వాడటంవల్ల టైప్2 డయాబెటిస్ ముప్పును తగ్గిస్తోందని యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు చెబుతున్నారు.

బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ లో నమోదైనవారి ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. అరుదుగా ఉప్పు తినేవారికి షుగరు ముప్పు కేవలం 13 శాతమే ఉంటోంది. కొన్నిసార్లు వేసుకునేవారికి 20 శాతం, ప్రతిసారీ ఉప్పు వేసుకునేవారికి 39 శాతం షుగరు వచ్చే ముప్పు కనపడుతోంది. ఉప్పుతో షుగరు వచ్చే ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి కారణం ఏమిటనేది స్పష్టంగా తెలియరావడంలేదు. ఎక్కువెక్కువ తినడం కూడా ఒక కారణం కావొచ్చని భావిస్తున్నారు. ఊబకాయం ఉన్నవారిలో, కణ అంతర్గత వాపు ప్రక్రియ మరింత పెరుగుతున్నట్లు తేలింది.












Click it and Unblock the Notifications