ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే.. షుగర్ పరీక్ష చేయించాల్సిందే..!!
డయాబెటిస్. వయసుతో సంబంధం లేకుండా విస్తరిస్తోన్న వ్యాధి. ఒక్క సారి శరీరంలో ఈ వ్యాధి మొదలైతే నియంత్రణలో ఉంచుకోవటం అవసరం. డయాబెటీస్ లో లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి టైప్ 1 డయాబెటిస్ కాగా, రెండోది టైప్ 2. ఈ రెండు రకాల డయాబెటిస్ రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే, ప్రారంభ దశలో కొన్ని లక్షణాలు డయాబెటిస్ వస్తున్నట్లుగా స్పష్ట మైన సంకేతాలు ఇస్తాయి. ఆ దశలోనే జాగ్రత్తలు తీసుకుంటే కొంత మేర ప్రయోజనం ఉంటుంది. అయితే, ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే షుగరు పరీక్ష చేయించుకోవాలి.
డయాబెటిస్ ప్రారంభ దశలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. టైప్ 1 డయాబెటిస్ ఉంటే బాడీలో ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది లేదా కాకపోవచ్చు. ఇది పిల్లలు, యుక్తవయసులో ఉన్నవారికి వస్తుంది. కానీ, కొందరిలో ఏ వయసులోనైనా టైప్ 1 మధుమేహం కనిపిస్తుంది. కాగా వీరిలో కనిపించే లక్షణాలను నిపుణులు వివరిస్తున్నారు. వారిలో అసాధారణ స్థాయిలో దాహం, ఆకలి ఎక్కువగా ఉండటం, బరువు తగ్గటం, తరచూ మూత్ర విసర్జన, అలసట, కంటి చూపు మందగించటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

టైప్ 2 డయాబెటిస్ లక్షాణాల్లో అధిక మూత్ర విసర్జన, విపరీతమైన దాహం, ఆకలి, అలసట, పుండ్లు త్వరగా మానకపోవడం, ఆకస్మాత్తుగా బరువు తగ్గడం, తిమ్మిరి లేదా జలదరింపు, లైంగిక సమస్యలు కనిపిస్తాయి. ఈ రెండు రకాల డయాబెటిస్ లో లక్షణాలు కనిపిస్తే మాత్రం ముందుగా షుగరు పరీక్ష.. వైద్యుడి వద్దకు వెళ్లటం ద్వారా ప్రారంభ దశలోనూ జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. డయాబెటిస్ వల్ల ఎన్నో ప్రమాదకర రోగాలు చుట్టుముడతాయి.
గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మూత్రపిండాలు దెబ్బతింటాయి. అంతేకాదు, కంటి చూపు కోల్పోయే ఛాన్స్ ఉంది. నరాలు దెబ్బతిని అస్తవ్యస్తం అవుతాయి. కాబట్టి, షుగర్ విషయంలో అలర్ట్‌గా ఉండాలని, తప్పకుండా చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పై లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మంచి ఆహారం తీసుకంటూ, రోజూ వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.
-
'వెయిట్ లాస్ సూప్'.. ఇలా చేసుకుని తాగితే వెయిట్ లాస్ గ్యారంటీ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications