డయాబెటిక్ న్యూరోపతి గురించి తప్పక తెలుసుకోండి.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
భారతదేశంలో డయాబెటిక్ న్యూరోపతి చాలా మందిని ప్రభావితం చేస్తోంది. రోజు రోజుకూ డయాబెటిక్ న్యూరోపతి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇది మధుమేహం వల్ల వచ్చే ఒక తీవ్రమైన నరాల సమస్య. దీనివల్ల నరాలకు నొప్పి, నష్టం కలుగుతుంది. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే, దాని కారణాలు, లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిక్ న్యూరోపతిపై అవగాహన చాలా అవసరం.
డయాబెటిక్ న్యూరోపతికి కారణాలు
చాలాకాలం పాటు రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే సమస్య డయాబెటిక్ న్యూరోపతి. దీని కారణంగా శరీరంలోని నరాలు దెబ్బతింటాయి. రక్తంలో చక్కెరను సరిగా నియంత్రించకపోవడం, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు డయాబెటిస్ న్యూరోపతికి ప్రధాన కారణాలు. డయాబెటిక్ న్యూరోపతితో బాధపడే వాళ్ళు ముందు ఈ లక్షణాలను గుర్తించి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ముందుగానే దీనిని గుర్తిస్తే సమర్ధవంతంగా తగ్గించుకోవటానికి వీలవుతుంది.

డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలు
సాధారణంగా చేతులు, కాళ్ళలో తిమ్మిర్లు, మంట లేదా నొప్పి ఉండటం వంటి లక్షణాలు గమనిస్తే డయాబెటిక్ న్యూరోపతితో బాధ పడుతున్నారని గుర్తించాలి. కొంతమందికి కండరాలు బలహీనపడటం, నడవడానికి ఇబ్బంది పడటం వంటివి కూడా ఉంటాయి. ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం వల్ల వాటిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
డయాబెటిస్ తో వచ్చే నరాల నొప్పుల నివారణ, నిర్వహణ ఇలా
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతి నివారణకు చాలా ముఖ్యం. డయాబెటిస్ తో నరాల సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం. నిరంతరం వైద్యుల సలహా తీసుకోవడం, రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవడం కూడా అవసరం.
భారతదేశంలో పెరుగుతున్న డయాబెటిక్ న్యూరోపతి ఆందోళన
భారతదేశంలో షుగర్ వ్యాధి కేసులు పెరుగుతున్నందున, డయాబెటిస్ న్యూరోపతి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్య గురించి అవగాహన పెంచుకోవడం వల్ల ప్రారంభ దశలోనే గుర్తించి, చికిత్స అందించడం సులభమవుతుంది. పూర్తిగా నరాలకు నష్టం జరిగే దాకా చూడకుండా ఆదిలోనే జాగ్రత్త పడితే దీని నుండి బయటపడవచ్చు.












Click it and Unblock the Notifications