ఆయుర్వేదంలో షుగరు అనేది వ్యాధే కాదు.. మీకు తెలుసా?
మారిన జీవనశైలితో వయసు తారతమ్యం లేకుండా అందరినీ మధుమేహ వ్యాధి ఇబ్బంది పెడుతోంది. ఇంగ్లిషు వైద్యం ప్రకారం షుగరు వస్తే జీవితకాలం మందులు వేసుకుంటూనే ఉండాలి. ప్రతి ఆరు నెలలకు పరీక్షలు చేయించుకుంటూ అమ్మో షుగరు పెరిగిపోతోంది.. శరీరంలో ఇతర అవయవాలు దెబ్బతింటాయంటూ ఆందోళనకు గురవుతాయం. ఆ ఆందోళన కాస్తా తీవ్రమైన ఒత్తిడికి దారితీసి మధుమేహాన్ని మరింత పెంచుతుంది.
కానీ సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి మన భారతీయ సాంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదంలో ప్రతి రోగానికి మందు ఉంది. కాకపోతే దాన్ని తెలుసుకొని ఇవ్వగలిగే వైద్యులు ఉండాలి. ఆయుర్వేద వైద్యులు ఇప్పటికీ చెబుతున్న మాట ఏమిటంటే.. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే షుగరు అనేది చిన్న జలుబు లాంటిదే అని అంటున్నారు.

ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు..
ఆయుర్వేదం ప్రకారం పరగడుపున మెంతి గింజలు నోట్లో వేసుకుని మజ్జిగ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతి గింజల్లో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్, గెలాక్టోమన్నన్ రక్తంలో చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. ఫైబర్ కడుపు నిండుగా ఉండే అనుభూతిని ఇస్తుంది. దీంతో తక్కువ తింటారు. మెంతి గింజలు జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.
చక్కెరను నియంత్రిస్తాయి..
మజ్జిగ ఒక పులిసిన పాల ఉత్పత్తి. దీనిలో ప్రోబయోటిక్స్, ప్రోటీన్, కాల్షియం, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. మజ్జిగలోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడతాయి. మజ్జిగ శరీరానికి చల్లదనాన్నిస్తుంది. వేసవిలో శరీరంలో డీహైడ్రేషన్ రాకుండా చూస్తుంది. మజ్జిగలోని విటమిన్లు, ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. పరగడుపున మెంతి గింజలను నోట్లో వేసుకొని మజ్జిగ తాగడం వల్ల ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి.
అంతే కాకుండా షుగర్ పెరగదు. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. మెంతి గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మజ్జిగ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది కాబట్టి ఇది చక్కెర నియంత్రణకు మరింత సహాయపడుతుంది. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది, బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. ప్రస్తుతం మధుమేహానికి మందులు వాడుతున్నవారు వైద్యుని సలహా తీసుకొని దీన్ని పాటించడం ఉత్తమం.












Click it and Unblock the Notifications