ధనుష్ పొలిటికల్ ఎంట్రీ- ఫ్యాన్స్ కు పిలుపు: లేటెస్ట్ అగ్రెసివ్ వీడియో
ప్రముఖ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమలో చర్చకు దారితీశాయి. తన అభిమాన సంఘాలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు, చేసిన సూచనలు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. త్వరలోనే ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నారనే ఊహాగానాలకు బలాన్ని చేకూర్చాయి. సినిమాలు, ప్రచార వేడుకలకు మాత్రమే పరిమితం కాకుండా చురుగ్గా సమాజ సేవలో భాగస్వామ్యులు కావాలని అభిమానులకు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అభిమానులందరూ ఒకే చోట చేరడం వల్ల ఏర్పడే ఐక్యతకు ఒక గొప్ప శక్తి ఉంటుందని, ఈ ఐక్యతకు ఒక మంచి ప్రయోజనం, దిశదశను తీసుకురావడానికి ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ బలాన్ని ఆడియో ఫంక్షన్లకో, తనను కలవడానికో పరిమితం చేయొద్దని, ప్రజలకు అవసరమైనంత సాయం అందించేలా సేవా కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు. పేద కుటుంబాలకు చేతనైన సహాయం అందించాలని ధనుష్ స్పష్టం చేశారు.

ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలకు కేంద్రబిందువు అయ్యాయి. ముఖ్యమంత్రి విజయ్ కూడా టీవీకేను స్థాపించడానికి ముందు ఇలాంటి సామాజిక కార్యక్రమాలే చేపట్టారు. ఇప్పుడు ధనుష్ సైతం అదే మార్గాన్ని ఎంచుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అక్కడితో ఆగలేదాయన. సమాజ హితం కోసం మరింత మందిని ప్రోత్సహించాలని కూడా తన అభిమానులకు సూచించారు.
తమిళనాడు రాజకీయాల్లో సినిమా రంగానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. గతంలో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత నుండి విజయ్ వరకు ఎందరో సినీ ప్రముఖులు రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ఈ నేపథ్యంలోనే ధనుష్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్నారనే ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో ఊపందుకుంది.
Looks like we can expect Dhanush launching his new party sooner than expected.
— Raghu Rajaram (@RaghuTweetbook) July 26, 2026
Vijay had been doing many welfare activities for years through his Vijay Makkal Iyakkam before officially launching TVK in 2024. One of the big events that confirmed his entry sooner was the 2023… https://t.co/XDZOvVg3pa pic.twitter.com/rQkcdRFCn6
తనకు లభించిన జాతీయ చలనచిత్ర అవార్డుల వివాదంపైనా స్పందించారు ధనుష్. ఈ అవార్డును పొందడానికి రాయన్ కంటే మెరుగైన సినిమాలు ఎన్నో ఉన్నాయంటూ వచ్చిన విమర్శలను స్వాగతించారు. ఇందులో వాస్తవం ఉందని నిజమేనని అంగీకరించారు. 2024లో రాయన్ కన్నా మెరుగైన సినిమాలు విడుదల అయ్యాయని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications