గ్రీన్ టీ రెగ్యులర్ గా తాగుతున్నారా, అయితే - ఇది మీ కోసమే..!!
గ్రీన్ టీ. ఈ మధ్య కాలంలో గ్రీన్ టీ వినియోగం బాగా పెరిగింది. ఈ గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో ఆరోగ్య పరంగా మేలు చేస్తుంది. చాలామంది ఉదయం నిద్రలేచాక గ్రీన్ టీతోనే రోజును ప్రారంభిస్తారు.అయితే, గ్రీన్ టీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పని సరి. లేదంటే సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. కొన్ని ఆరోగ్య పరమైన సమస్య లు ఎదుర్కొంటున్న వారు సైతం గ్రీన్ టీ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి? ఎప్పుడు తాగకూడదో స్పష్టత ఇస్తున్నారు.
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారు, డీటాక్స్ కోసం ప్రయత్నించే వారు ఎక్కువగా తాగుతారు. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచు తుంది. చెడు కొలె స్ట్రాల్‌ను క్లీయర్ చేస్తుంది. గ్రీన్ టీలో ఫ్రీ రాడికల్స్‌ను నివారించే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మెటబాలిజంను పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరాన్ని డీటాక్స్ చేసి శక్తిని ఇస్తుంది. మెదడును ఉత్తేజ పరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇవన్నీ మేలు చేసేవి కాగా, ఉదయం వేళ ఖాళీ కడుపున తీసుకునే వారికి సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రీన్ టీలో టానిన్లు ఉంటాయి. ఇవి కడుపు ఆమ్లతను పెంచుతాయి. మీకు వికారం లేదా ఉబ్బరం కలిగిస్తాయి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే, ఉదయం ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల మన కడుపులో యాసిడ్ స్థాయిలు పెరిగిపోతాయి.అజీర్తి చేస్తుంది.

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంది. ఇది గ్యాస్ట్రిక్, యాసిడిటీ వంటి సమస్యలు రావొచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే కడుపులో యాసిడ్ స్థాయి పెరిగి గ్యాస్, మలబద్ధకం, మైగ్రేన్ వంటి సమస్యలు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఖాళీ కడుపున కాకుండా.. భోజనం తర్వాత లేదా టిఫిన్‌తో పాటు గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇదే సమయంలో దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పూర్తిగా ప్రభావితం కావడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.గ్రీన్ టీలోని టానిన్లు శరీరంలో ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. దీంతో, రక్తహీనత సమస్యతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి. రక్తహీనత సమస్య ఉన్నవారు గ్రీన్ టీ తాగడం వల్ల ఐరన్ లోపం మరింత ఎక్కువ కావచ్చు. అధిక మోతాదులో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల లివర్‌పై ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. ఇప్పటికే లివర్ సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
-
Hormuz Showdown: హార్ముజ్ లోనే తాడోపేడో..! అమెరికా-ఇరాన్ లో గెలిచేదెవరు ? -
గ్రీన్ టీ Vs బ్లాక్ టీ: రెండింటి లో ఏది మంచిది, పరిమితి..!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications