తులసి ఆకుల నీళ్లను తాగండి- ఈ సమస్యలకు సూపర్ మెడిసిన్..!!
తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచేందుకు గాను తులసి ఆకులు ఎంతగానో పనిచేస్తాయి. ఆయుర్వేదంలో తులసి ఆకుల తో ప్రయోజనాలను వివరించారు. తులసి ఆకులతో తయారు చేసే నీళ్లను తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. తులసి ఆకుల నీరు తీసుకోవటం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గటం తో పాటుగా శ్వాస కోస వ్యాధులు తగ్గిచుకోవచ్చు. మధుమేహ వ్యాధి గ్రస్తులకు తులసి ఆకుల నీరు ఎంతో ప్రయోజనకరమని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
తులసి ఆకులతో ఎన్నో ఆరోగ్య పరమైన లాభాలు ఉన్నాయి. ఒకపాత్రలో కొన్ని నీళ్లను తీసుకుని అందులో కొన్ని తులసి ఆకులను వేసి మరిగించాలి. నీరు బాగా మరిగిన తరువాత వడకట్టి అందులో కొద్దిగా తేనె కలిపి తాగాలి. ఇలా తులసి ఆకుల నీళ్లను రోజుకు 2 సార్లు తాగితే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. తులసి ఆకుల్లో అడాప్టోజెనిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆకులతో నీళ్లను తయారు చేసి తాగితే ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. డిప్రెషన్, ఆందోళన ఉన్నవారు రోజూ ఈ నీళ్లను తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోతాయి. తులసి ఆకులు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయం చేస్తాయి.

తులసి ఆకులతో నీళ్లను తయారు చేసి తాగితే పలు జీర్ణాశయ ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. అలాగే కడుపు ఉబ్బరం, అజీర్తి, గుండెల్లో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్టలో ఏర్పడిన అసౌకర్యం తొలగిపోతుంది. ఈ ఆకుల నీళ్లను తాగుతుంటే శ్వాస నాళాల్లో, గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. తులసి ఆకుల్లో షుగర్ లెవల్స్‌ను తగ్గించే సమ్మేళనాలు ఉంటాయి. ఈ ఆకుల్లో అనేక రకాల ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేలా చేయడం తోపాటు ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకునేలా చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. తులసి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది.












Click it and Unblock the Notifications