యవ్వనంగా, ముడతలు లేకుండా చర్మ సౌందర్యం కోసం ఇవి తినండి!

వయస్సు పెరుగుతున్న కొద్ది ముఖం మీద ముడతలు, మచ్చలు వస్తూ ఉంటాయి. అయితే ముఖం మీద ముడతలు, మచ్చలు పోయేలా అనేక సంప్రదాయ ఆహారాలు మన చర్మాన్ని రక్షించడానికి, వృద్ధాప్య లక్షణాలను నివారించడానికి దోహదం చేస్తాయి. మెరుస్తున్న చర్మాన్ని మనకు అందించి యాంటీ ఏజింగ్ ఆహారాలుగా ఉపయోగపడే ఆహారాల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ముఖం మీద ముడతలు తగ్గించే ఆహారాలలో బాదం బెస్ట్

ముఖం మీద ముడతలను తగ్గించి చర్మ ఆరోగ్యానికి దోహదం చేసే వాటిలో బాదంపప్పు ఒకటి. దీనిలో విటమిన్ ఈ ఉంటుంది. ఇది చర్మాన్ని సూర్యకాంతి నుండి రక్షించడంలోను, తేమగా ఉంచడంలోనూ దోహదం చేస్తుంది. ప్రతిరోజు బాదం పప్పు తినడం వల్ల చర్మ నిర్మాణం మెరుగుపడుతుంది. యంగ్ లుక్ కనిపిస్తుంది.

Eat these for youthful wrinkle-free skin

పాలకూర తో చర్మ సౌందర్యం మెరుగుదల

పాలకూర విటమిన్లతో పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది కొల్లాజిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. మన చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఆహారంలో పాలకూరను చేర్చుకోవడం ద్వారా ముఖం మీద ముడతలు, మచ్చలు తగ్గి చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పెరుగుతో సున్నితమైన చర్మం

భారతీయ ఆహారాలలో ప్రధానమైన ప్రో బయోటిక్స్ తో నిండి ఉన్న ఆహారం. ఇందులో ఉండే లాభదాయకమైన బ్యాక్టీరియా మన జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల, స్పష్టమైన సున్నితమైన ముఖ చర్మం సొంతమవుతుంది. ఇది కూడా మన వయసును తగ్గిస్తుంది.

ఉసిరికాయలతో యవ్వనంగా చర్మం

ఉసిరి కాయలలో కూడా విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొల్లాజిన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. ఇది మన ముఖం పైన ముడతలను తగ్గించి, యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ప్రకాశవంతమైన, ఆరోగ్యవంతమైన చర్మం కోసం ఉసిరికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది.

చిలకడ దుంపలతో ఆరోగ్యకరమైన, అందమైన చర్మం

చిలకడ దుంపలు బీటా కెరోటిన్ యొక్క మూలం. ఇది విటమిన్ ఏగా మారే యాంటీ ఆక్సిడెంట్. ఇది మన చర్మానికి మంచి పోషణను, రక్షణను ఇస్తుంది. మన ముఖం మీద ముడతలను, మచ్చలను తగ్గిస్తుంది. చిలకడ దుంపలను క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యకరమైన చర్మం సొంతమవుతుంది.

ఈ నేచురల్ ఫుడ్స్ తో చర్మ ఆరోగ్యం

యవ్వనంగా ఉండాలనుకునేవారు ముఖం మీద ముడతలు, మచ్చలు లేకుండా నిగారింపుతో కూడిన చర్మాన్ని సొంతం చేసుకోవాలి అనుకునేవారు సహజ సిద్ధంగా ఉండే ఈ ఆహారాలను మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. అద్భుతమైన చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+