చలికాలంలో అద్భుతం... ఈ పండు!
సృష్టిలో మనకు భగవంతుడు అనేక రకాల పండ్లను సృష్టించి ఇచ్చాడు. ఇవి కాలానుగుణంగా అందుబాటులోకి వస్తుంటాయి. ఏ కాలానికి ఆ కాలంలో దొరికే పండ్లను తినాలని వైద్యులు కూడా చెబుతుంటారు. ప్రస్తుతం శీతాకాలం కావడంతో ఈ కాలంలో తినేపండ్లు చాలావున్నాయి. వాటిల్లో ప్రధానమైనది బొప్పాయి పండు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్స్, మినరల్స్‌ను అందిస్తాయి.
బొప్పాయి పండు ప్రయోజనాలు
బొప్పాయిలోని పెప్సిన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుగుపరుస్తాయి. బొప్పాయిలోని బీటా కెరోటిన్ కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. బొప్పాయిలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించడంలో సహాయపడతాయి.

బొప్పాయిని ఎలా తీసుకోవాలి?
నేరుగా పండుగా తినవచ్చు. బొప్పాయి జ్యూస్ తాగొచ్చు. కొందరు సలాడ్‌లో కలిపి తింటారు. అలాగే స్మూతీలో కలిపి తాగవచ్చు. కొన్ని వంటల్లో కూడా బొప్పాయిని ఉపయోగిస్తారు. అతిగా పచ్చి బొప్పాయిని తినడంవల్ల జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. అలర్జీ ఉన్నవారు బొప్పాయిని తినడానికి ముందు వైద్యుని సలహా తీసుకోవాలి.
పోషకాల నిధిలాంటి బొప్పాయిని రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. చల్లని వాతావరణంలో దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి లోపం తీరుతుంది. తద్వారా జీర్ణక్రియ బాగుంటుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో 200 గ్రాముల బొప్పాయిని తినమని యోగా గురువులు, ఆయుర్వేద వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇలా తినడంవల్ల శరీరానికి సంపూర్ణ పోషణ అందుతుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది. పోషకాల లోపాన్ని తగ్గిస్తుంది.












Click it and Unblock the Notifications