హై బీపీని ఇలా తగ్గించటం మీకు తెలుసా!
అధిక రక్తపోటు ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది. అయితే, కొన్ని జీవనశైలి మార్పులు చేసుకుంటే ఈ పరిస్థితిని సమర్థవంతంగా నియంత్రించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, మరియు ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి బీపీని కంట్రోల్ చేసుకోవడానికి చాలా అవసరమని, ఈ మార్పుల వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాకుండా, పెద్ద పెద్ద అనారోగ్యాల ప్రమాదం కూడా తగ్గుతుందని అంటున్నారు.
వ్యాయామం ఇలా చేస్తే మంచిది
రక్తపోటును నియంత్రించాలంటే శారీరక శ్రమ చాలా ముఖ్యం. నడవడం, సైకిల్ తొక్కడం లేదా ఈత కొట్టడం వంటివి మంచి ఫలితాన్ని ఇస్తాయని చెబుతున్నారు. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సరైన బరువును నియంత్రించడమే కాకుండా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

సమతుల ఆహారాన్ని తీసుకోవాలి
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. బీపీ తగ్గాలంటే ఉప్పు వాడకం తగ్గించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువ సోడియం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటును కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఒత్తిడిని కూడా తగ్గించుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చేయాలి.
ఈ అలవాట్లు మానేస్తే మంచిది
అధిక రక్తపోటు ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది. అయితే, కొన్ని జీవనశైలి మార్పులు చేసుకుంటే ఈ పరిస్థితిని సమర్థవంతంగా నియంత్రించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, మరియు ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి బీపీని కంట్రోల్ చేసుకోవడానికి చాలా అవసరమని, ఈ మార్పుల వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాకుండా, పెద్ద పెద్ద అనారోగ్యాల ప్రమాదం కూడా తగ్గుతుందని అంటున్నారు.
బీపీ విషయంలో జాగ్రత్త
మీ రక్తపోటును ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం వల్ల మీ ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో తెలుసుకోవచ్చు, అలాగే అవసరమైన జీవనశైలి మార్పులు చేసుకోవచ్చు. ఈ జీవనశైలి మార్పులను పాటించడం వల్ల అధిక రక్తపోటును నియంత్రించడం సాధ్యమవుతుంది. దీర్ఘకాలం మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే, ముఖ్యంగా బీపీ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.

Click it and Unblock the Notifications