కోడిగుడ్లలో పచ్చని సొన తినాలా.. వద్దా..? అసలు విషయం..!!
కోడిగుడ్లు. ఎన్నో పోషకాలు ఉండటం ఆరోగ్యం కోసం చాలామంది తీసుకుంటారు. అయితే, గుడ్డు లోని పచ్చని సొనను తినేందుకు మాత్రం చాలా మంది ఆలోచిస్తారు. దీనిని తీసుకోవటం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయనే అభిప్రాయం ఉంది. అదే సమయంలో కోడిగుడ్డు తో పాటుగా పచ్చని సొన పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు. కొలెస్ట్రాల్.. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం పచ్చసొన కు దూరంగా ఉండాలి. ఎలర్జీలు ఉన్నవారికి మంచిది కాదు. అయితే,ఈ పచ్చ సొన తీసుకోవటం వలన కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కోడిగుడ్డు పచ్చనిసొన ఆరోగ్యకరమే అయినప్పటికీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం దీన్ని తినకూడదని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులు ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు పచ్చ సొనకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆరోగ్యవంతంగా ఉన్నవ్యక్తులు రోజుకు 2 కోడిగుడ్లను పచ్చ సొనతో సహా తినవచ్చు. ఇతర వ్యక్తులు రోజుకు ఒక కోడిగుడ్డును మాత్రమే పచ్చసొనతో సహా తినవచ్చు. అంతకు మించి తినకూడదు.

కోడిగుడ్డు పచ్చ సొనను వదిలేస్తే చాలా పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది. శరీరానికి కావల్సిన అనేక పోషకాలు పచ్చసొనలో కూడా ఉంటాయి. కోడిగుడ్డును పచ్చని సొనతో సహా కలిపి పూర్తిగా తినవచ్చు. పచ్చసొనను విడిచిపెట్టాల్సిన పనిలేదు. ఇక ఇందులో అనేక విటమిన్లు కూడా ఉంటాయి. విటమిన్లు డి, బి12, ఎ, ఇ, కెలతోపాటు ఐరన్, సెలీనియం, ఫాస్ఫరస్, కోలిన్ లు సమృద్ధిగా ఉంటాయి.
పచ్చసొనను తినకపోతే ఈ పోషకాలను కోల్పోతారు. కనుక పచ్చ సొనను తినటం మంచిదని సూచిస్తున్నారు. పచ్చ సొనను తినడం వల్ల కోలిన్ అధికంగా లభించి మెదడు పనితీరు మెరుగు పడుతుంది. పచ్చ సొనలో లుటీన్, జియాజాంతిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. ఇవి కళ్లను రక్షిస్తాయి. పచ్చ సొనలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
కోడిగుడ్డు పచ్చసొనలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల వల్ల ఆ సొనలోని విటమిన్లు ఎ, డి, ఇ, కె లను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. పోషకాహార లోపం ఉండదు. ఈ సొనను తింటే ఐరన్ లభించి రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఇలా పలు జాగ్రత్తలను పాటిస్తూ కోడిగుడ్డులోని పచ్చసొనను తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు. అయితే, గుండె సంబంధత సమస్యలు ఉన్నవారు మాత్రం పచ్చసొనకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications