ఫ్రిజ్ లో పెట్టిన కోడిగుడ్లను తింటున్నారా..అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!
కోడిగుడ్డు. శరీరానికి కావాల్సి పోషకాలు అందిస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఆహార పదార్థాల్లో గుడ్డు ఒకటి. తాజా పరిస్థితుల్లో గుడ్లను తినడం అవసరం కూడా. రోగ నిరోధక శక్తిని పెంచడంలో వాటికి సాటేది లేదు. అయితే, చాలా మంది మార్కెట్ నుండి తెచ్చిన గుడ్లను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేస్తారు. పదార్ధాలను ఫ్రిజ్ లో ఉంచి తినటం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, గుడ్ల విషయంలోనూ పలువురిలో అపోహలు ఉన్నాయి. ఫ్రిజ్ లో గుడ్లు ఎన్ని రోజుల ఉంచవచ్చు.. అసలు ఫ్రిజ్ లో నిల్వ చేసిన గుడ్లు ఆరోగ్యానికి మంచిదేనా అనే ప్రశ్నలకు నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
సాధారణంగా ప్రతీ ఇంటా గుడ్లను ఫ్రిజ్ లో వినియోగించటం కనిపిస్తుంది. గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనే ఉద్దేశంతో వాటిని ఫ్రిజ్‌లో పెడతారు. అయితే, గుడ్లను ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచి తినడం వల్ల, ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు నిరూపించాయి. గుడ్లను ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల వాటిలోని పోషకాలు చాలా వరకు పోతాయని పరిశోధనలు చెబుతున్నాయి. దీనివల్ల గుడ్ల ద్వారా శరీరానికి లభించే ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని, ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, సాధ్యమైనంత వరకు గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టకుండా ఉండటం మంచిది. తప్పనిసరి అయితే, చాలా తక్కువ సమయం మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలని సూచిస్తున్నారు.

ఎక్కువ రోజులు గుడ్లను ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచి తినడం వల్ల.. వాటి పోషకాలు అందకపోగా.. ఇతర అనారోగ్య సమస్యలు ఎటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వీటిని ఫ్రిడ్జ్‌లో ఎంత తక్కువ ఉంచితే అంత మంచిది. గుడ్లను ఫ్రిజ్‌లో 3 లేదా 5 వారాలకు మించి నిల్వ చేయకూడదు. నిల్వ చేసినా ఫ్రిజ్ దిగువ భాగాన.. ఒక బాక్స్‌లో పెట్టి స్టోరేజ్ చేయాలి. ఫ్రిజ్‌లో నిల్వ చేసే ముందు గుడ్లను శుభ్రంగా నీటిలో కడిగి పెట్టాలి. అప్పటి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు అవసరమైన వరకు గుడ్లను తెచ్చుకొని వినియోగించటం ద్వారా పోషకాలు ఉంటాయని.. ఫ్రెష్ గుడ్లు వినియోగం పెరుగుతుందని చెబుతున్నారు. కాగా.. ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో ఉంచకుండా.. అవసరం మేర వరకు వినియోగిస్తే సమస్యలు ఉండవని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications