కోడిగుడ్లు తినే సమయంలో ఈ పొరపాట్లు చేయకండి..!!
గుడ్డు పోషకాల ఘని. ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. కోడిగుడ్లలో విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కండరా ను బలంగా ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి. ఇంకా దెబ్బతిన్న కణజాలాలను సరి చేస్తాయని నిపు లు చెబుతున్నారు. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కాగా, కోడిగుడ్లు తినటం పైన కొందరిలో కొన్ని అపోహలు ఉన్నాయి. అసలు రెగ్యలర్ గా తినచ్చా.. ఎన్ని తినాలి.. ఏ సమయంలో తినాలి అనే సందేహాల పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
కోడిగుడ్లు శరీరానికి అనేక రకాలుగా ప్రయోజనాలు అందిస్తాయి. అదే సమయంలో కొందరికి సమస్యలకు కారణం అవుతాయి. సాధారణంగా హెల్దీగా ఉండేవారు రోజుకు ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డును తినడం మంచిదేనని నిపుణుల సచన. అదే విధంగా కొందరిలో డైలీ ఎగ్‌ను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. గుండె ఆరోగ్యానికి గుడ్లు మేలు చేసేవే అయినప్పటికీ వీటిని అధికంగా తీసుకోకుండి పరిమితంగా ఆహారంగా మార్చుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఇక ఈ గుడ్లను చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్, శుద్ది చేసిన పిండి వంటి వాటితో కలిపి కేక్స్, కుకీస్ వంటి ఆహారాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. దీంతో ఈ క్యాలరీల రేటు మరింత పెరిగి ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. దీంతో, గుండెకు మేలు జరగడం పోయి గుండె జబ్బులు, అధిక బరువు, మధుమేహం, శరీరంలో కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలు పెరగడం వంటి సమస్య ను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో, గుడ్లను తగిన మోతాదులో తీసుకోవడం కూడా చాలా అవసరం.

పరిమితి మేరకు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు
కోడిగుడ్డులో పచ్చసొన అనేక పోషకాలకు మూలం గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఏ, డీ, ఈ, బీ -12, కే, ఐరన్, రిబోఫ్లేవిన్ వంటివి చాలా ఉన్నాయి. ఇవి మన శరీరానికి కూడా చాలా అవసరం. ఇవి శరీర సమతుల్యతను అభివృద్ధి చేయడంలో చాలా కీలకమైనవి. కేవలం గుడ్డులోని తెల్లటి భాగాన్ని మాత్రమే తింటుంటే, ఈ పోషకాలన్నింటికి మీరు దూరంగా ఉన్నట్లే. అందుకే గుడ్డులోని పసుపు భాగాన్ని కూడా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించబడిన హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నివేదిక ప్రకారం, ప్రతీ వారం ఏడు గుడ్లు తినే వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా తక్కువ. అయితే, ఒక రోజులో పచ్చసొనతో రెండు కంటే గుడ్లు తింటే మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని పేర్కొంది.












Click it and Unblock the Notifications