ఉడికించిన గుడ్డు Vs ఆమ్లెట్ - ఎవరికి ఏది మంచిది..!!
గుడ్డు ఒక పోషకాల గని. ఇందులో అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పౌష్టికాహార లోపం అధిగమించాలనుకునే వారికి గుడ్డు మేలు చేస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలు, ప్రోటీన్లు, మాంసకృత్తులను అందించి.. ఆరోగ్యవంతంగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. గుడ్డును పగలగొట్టి వేసే ఆమ్లెట్ కూడా మంచి ఆహారమే. మరి.. ఉడికించిన గుడ్డు - ఆమ్లెట్ లో ఆరోగ్య పరంగా ఎక్కువ ప్రయోజనాలు ఎందులో ఉంటాయి. ఎవరికి ఏది మంచిదనేది నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
గుడ్లలో అధిక నాణ్యత గల ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఉడకబెట్టడం అనే ప్రక్రియ గుడ్డులోని చాలా పోషకాలను సంరక్షిస్తుంది. గుడ్డులో ఉండే విటమిన్లు B12, D, రిబోఫ్లావిన్‌లు, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు ఉడకబెట్టడం వల్ల శరీరానికి తగినట్టు సరళంగా మారతాయి. సులభంగా జీర్ణమవుతాయి. ఉడికించిన గుడ్లలో కోలిన్ అనే పోషకం మెదడు ఆరోగ్యానికి, అభివృద్ధికి సహాయపడుతుంది. ఉడకబెట్టిన గుడ్డును తినడం అంటే మంచి పోషకాహారాన్ని తీసుకోవడమే. గుడ్లు కోలిన్ యొక్క అద్భుతమైన మూలం. మెదడు, నాడీ వ్యవస్థ పనితీరుకు అవసరమైన పోషకం. లుటీన్.. జియాక్సంతిన్ యాంటీ ఆక్సిడెంట్లు గుడ్డు సొనలో ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. గుడ్డును పగలగొట్టి వేసే ఆమ్లెట్ కూడా మంచి ఆహారమే. అయితే ఆమ్లెట్ వేసేటపుడు అదనంగా నూనె లేదా ఇతర పదార్థాలు కలుపుతారు. అందువల్ల పోషకాలతో పాటు కొంత చెడు కొలస్ట్రాల్ కూడా శరీరంలోకి చేరుతుంది. అలాగే నూనె వేసి వేయించడం వల్ల కొన్ని పోషకాలు కూడా పోయే ప్రమాదం ఉంది.

అయితే ఆమ్లెట్‌కు కొన్నిసార్లు జోడించే కూరగాయలు వల్ల మంచి కూడా జరుగుతుంది. బచ్చలి కూర తో నింపిన ఆమ్లెట్లు మన శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. కూరగాయలతో కూడిన ఆమ్లెట్‌లు విటమిన్ సి యొక్క గొప్ప మూలం. ఇది ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థకు కీలకం. ఉడికించిన గుడ్లు మరియు ఆమ్లెట్‌లు రెండూ ప్రత్యేకమైన పోషక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఉడికించిన గుడ్లు ప్రోటీన్, విటమిన్ డి మరియు కోలిన్ యొక్క గొప్ప మూలం. ఆమ్లెట్ లో ఫైబర్, ఐరన్, విటమిన్ సి, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ తీసుకోవడం కోసం ఉడికించిన గుడ్లు ఉత్తమ ఎంపికగా చెప్పొచ్చు. మరోవైపు, మీరు వివిధ రకాల పోషకాలతో నింపిన అల్పాహారం కావాలని అనుకుంటే మాత్రం అందుకు బెస్ట్ సెలెక్షన్ ఆమ్లెట్ గా సూచిస్తున్నారు. అయితే, గుడ్డును ఆమ్లెట్ రూపంలో తీసుకోవడం కంటే ఉడకబెట్టి తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications