ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!!
ఇటీవల ఎక్కువమంది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్‌లోనే అన్నం వండుతున్నారు. ఈ అలవాటు ఇప్పుడు పల్లెలకు కూడా తాకింది. ఎలక్ట్రిక్ కుక్కర్‌ను ఉపయోగించడం వల్ల సాంప్రదాయిక పద్ధతిలో వంటకు ఖర్చయ్యే సమయం, శ్రమ రెండూ తగ్గుతాయి. అయితే, ఎలక్ట్రిక్ కుక్కర్ లో వండిన ఆహారం ఆరోగ్యానికి మంచిదేనా.. నష్టం చేస్తుందా.. ఈ సందేహం అనేక మందిలో ఉంది. దీని పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు. అనుకూలతలతో పాటుగా ప్రతికూలతలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.
ఎలక్ట్రిక్ కుక్కర్ లో అన్నం వండటం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో ఆరోగ్య పరంగా నష్టాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో ఎక్కువ సేపు అన్నం ఉడికించడం వల్ల కొన్ని ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు (విటమిన్ B, C వంటి) కొంత మేర నష్టపోవచ్చు. వంటల్లో అల్యూమినియం పాత్రలు వాడకపోవడమే మంచిది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తినడం వల్ల అతి చిన్న వయసులోనే కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. లక్ట్రికల్ రైస్ కుక్కర్ పాత్ర టాక్సిన్ మెటల్‌తో తయారవుతుంది. ఇందులో అన్నం ఉడికించడం వల్ల అందులోని పోషకాలు కనుమరుగవుతాయి. నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అస్సలు వాడొద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎలక్ట్రిక్ కుక్కర్ వినియోగంలో జాగ్రత్తలు
కాగా, నాన్ స్టిక్ వస్తువులను వినియోగించి వంట చేసే సమయంలో అందులోంచి ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలవుతాయి. ఇవి క్యాన్సర్‌కు కారకాలుగా మారే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లను వాడకపోవడం మంచిది. రాగి సంకటి, రాగి జావ, జొన్న రొట్టెలు, కొర్రలతో అల్పాహారం చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అన్నం త్వరగా వండాలనుకున్నప్పుడు ప్రెజర్ కుక్కర్‌లో వండితే ఆరోగ్యానికి మేలు. కరెంట్ ఆధారంగా ఉడికిన ఆహారం తీసుకోకపోవడమే మంచిది. ఇక.. మట్టిపాత్రలు, లేదా స్టీల్ పాత్రల్లో అన్నం ఉడికించి తీసుకోవడం మేలు. మట్టిపాత్రల్లో అన్నం ఉడికించడం వల్ల మట్టిలోని పోషకాలు ఆహారానికి మరింత రుచిని ఇస్తాయి. ప్రెజర్ కుక్కర్‌లో అన్నం ఉడికించడం వల్ల పోషకాలు ఆవిరి రూపంలో కరిగిపోకుండా ఉంటాయని నిపుణులు వెల్లడించారు.
-
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు












Click it and Unblock the Notifications