బరువు తగ్గాలనుకునేవారికి మీ ఇంట్లోనే నేచురల్ పదార్ధాలు.. ట్రై చెయ్యండి!
ప్రస్తుత సమాజంలో చాలామంది విపరీతమైన బరువుతో బాధపడుతున్నారు. బరువును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జిమ్ ల వెంట, ఆస్పత్రుల వెంట పరుగులు పెడుతున్నారు. అయితే మన ఇంట్లో ఉండే అనేక పదార్థాలు మన బరువును తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తాయనే విషయం ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి. మన బరువు తగ్గడానికి దోహదం చేసే ఆ పదార్థాలు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
పసుపు
పసుపును, కరివేపాకును కలిపి నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని తీసుకుంటే అధిక బరువు తగ్గడానికి అది ఎంతగానో దోహదం చేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం బరువు తగ్గటానికి ఎంతగానో దోహదం చేస్తుంది. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి.

సోంపు
సహజంగా ఆహారం తిన్న తర్వాత సోంపు వేసుకుంటారు. సోంపులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే బరువు తగ్గాలని భావించేవారు సోంపును నీళ్లలో వేసి మరిగించి ఉదయం సమయంలో తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. దీంతో వీరు బాగా బరువు తగ్గుతారు.
జీలకర్ర
జీలకర్ర మనం సాధారణంగా వంటలలో ఉపయోగిస్తూ ఉంటాం. అటువంటి జీలకర్రను బరువు తగ్గాలని భావించేవారు ప్రతి రాత్రి 1 స్పూన్ జీలకర్రను నీళ్లలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగాలి. ఇది బెల్లీ ఫ్యాట్ పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇక దీనిని సూప్స్ లోను, పప్పులలోను, కూరలలోను, పచ్చళ్ళలోనూ బాగా ఉపయోగించవచ్చు. ఆహారంలో జీలకర్ర ఎక్కువ వినియోగం ఆరోగ్యాన్ని ఇస్తుంది.
మెంతి గింజలు
మెంతులను ఫైబర్ ఎక్కువగా ఉంటుంది . ఇది మనం అతిగా తినడానికి నిరోధిస్తుంది. ఫలితంగా బరువు తగ్గాలనుకునేవారు మెంతులను తమ డైట్లో భాగంగా చేసుకుంటే మంచిది ఈజీగా బరువు తగ్గుతారు. 50 మి.లీ నీటిలో 1 టీస్పూన్ మెంతి గింజలను వేసి మరిగించి టీని కూడా చేసుకుని తాగవచ్చు. ఫలితంగా అధిక బరువు తగ్గటానికి అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications