వాముతో ఫుల్ ఆరోగ్యం... వారెవ్వా అనిపించే హెల్త్ బెనిఫిట్స్!
మన ఆరోగ్య రక్షణ కోసం మన ఇంట్లోనే మనకు ఉపయోగపడే ఎన్నో రకాల పదార్థాలు ఉన్నాయి. అయితే వాటి అన్నిటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి వాటిలో వాము చాలా ముఖ్యమైనది. వాములో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రో బయల్ లక్షణాలు ఉంటాయి. వాముతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
వాముతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
వాము జీర్ణక్రియకు ఎంతో మంచిది. అజీర్ణం సమస్యతో బాధపడే వారికి, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వారికి, వాము ఎంతో బాగా ఉపయోగపడుతుంది. వాములోని థాయ్మోల్ అనే సమ్మేళనం అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించి జీర్ణ క్రియకు మనకి ఎంతో బాగా దోహదం చేస్తుంది. వాము రక్తపోటును తగ్గిస్తుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు వామును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అధిక రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో దోహదం చేస్తుంది.

హైబీపీతో పాటు ఈ అనారోగ్య సమస్యలకు వాముతో చెక్
అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారికి, స్ట్రోక్ మరియు గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. వామును తీసుకుంటే అది రక్తప్రసరణ మెరుగుపరిచి హైబీపీని తగ్గిస్తుంది.
వామును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ట్రై గ్లిజరైడ్స్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో వాము చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
జలుబు. దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు వామును తీసుకుంటే చాలా ఫలితం ఉంటుంది.
ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాలను రాకుండా చేసే వాము
వాము దగ్గు, జలుబు వంటి, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వామ్ వాటర్ తాగడం వల్ల మనకు సహజంగా వచ్చే ఇన్ఫెక్షన్లు, వైరస్ ల నుంచి ఉపశమనం కలుగుతుంది. వాము బ్యాక్టీరియాలతోనే ఇన్ఫెక్షన్లతోనూ పోరాటం చేస్తుంది. వాములో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు, ఈకొలి, సాల్మొనెల్లా వంటి హానికరమైన సూక్ష్మజీవులను ఎదుర్కోవడంలో వాము ఎంతగానో దోహదం చేస్తుంది.
పళ్ళ సమస్యలు, ఆర్ధరైటిస్ వంటి వాటికి వాముతో రిలీఫ్
వామును ఉపయోగించడం వల్ల పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. చిగుళ్ల ఇన్ఫెక్షన్ నుండి, నోటి ఇన్ఫెక్షన్లను కూడా వాము సమర్థవంతంగా తగ్గిస్తుంది.
వాము తీసుకుంటే ఆర్థరైటిస్ నుండి ఉపశమనం కలుగుతుంది . కీళ్లల్లో వాపు వల్ల వచ్చే ఆర్థరైటిస్ సమస్య నుండి వాము కాపాడుతుంది. వాము వాపు తగ్గించడంలోనూ ఆర్థరైటిస్ తో సంబంధం ఉన్న నొప్పిని తగ్గించడంలోనూ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications