గ్రీన్ టీ ఏ టైంలో తీసుకోవాలి, రోజుకు ఎంత మేర తీసుకోవచ్చు..!?
గ్రీన్ టీ వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్ టీని రోజూ తాగితే శరీర మెటబా లిజం పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గ్రీన్ టీని తాగితే మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఎన్నో ప్రయోజనా లు ఈ టీ వల్ల మనకు కలుగుతాయి. అయితే గ్రీన్ టీ ఆరోగ్యకరమే అయినప్పటికీ..గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి? ఎప్పుడు తాగకూడదో అనే సందేహాలకు నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
ఈ మధ్య కాలంలో పలువురు గ్రీన్ టీ ఎక్కువగా వినియోగిస్తున్నారు. గ్రీన్ టీలో టానిన్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి ఖాళీ కడుపుతో తీసుకుంటే కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఎసిడిటీ, గుండెల్లో మంట, అజీర్ణం లేదా వికారం వంటి సమస్యలను కలిగిస్తాయి. ఈ పద్ధతి అనుసరించే వారిలో కడుపు సహజ జీర్ణక్రియ దెబ్బతింటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, గ్రీన్ టీ తాగడానికి ఉత్తమ సమయాలు రెండే. భోజనం లేదా తేలికపాటి అల్పాహారం తర్వాత మాత్రమే ఈ పానీయం తీసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత గ్రీన్ టీ తాగడం అత్యుత్తమమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సి డెంట్లను అందుతాయి. శక్తి స్థాయిలను పెరుగుతాయి. భోజనం తర్వాత గ్రీన్ టీ తాగినా జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరమని చెబుతున్నారు.

అయితే, అధిక మోతాదులో తీసుకోవటం ద్వారా సమస్యలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. గ్రీన్ టీని అధికంగా సేవిస్తే అందులో ఉండే సమ్మేళనాల కారణంగా మనం తిన్న ఆహారం లో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. దీని కారణంగా ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఫలితంగా రక్తహీనత వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే అసలు తాగకూడదు. కనీసం 2 గంటల విరామం ఇచ్చి ఆ తరువాతే గ్రీన్ టీని సేవించాల్సి ఉంటుంది. దీంతో ఐరన్ శోషణకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఉంటుంది. అలాగే ఈ టీని అతిగా తాగితే గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీని వల్ల గుండెకు ప్రమాదం ఏర్పడుతుంది. కనుక ఈ టీని మోతాదుకు మించి తాగకూడదు. కనుక గ్రీన్ టీని రోజూ మోతాదులోనే తాగాల్సి ఉంటుంది. రోజుకు 2 కప్పుల వరకు ఈ టీని సేవించవచ్చు. అంతకు మించి తాగకూడదు. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల కడుపు నొప్పి, నిద్రలేమి, కాలేయంపై ఒత్తిడి వంటి పలు సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications