ఖాళీ కడుపుతో టీ స్పూన్ నెయ్యిని కలిపి ఈ రసాన్ని తీసుకోండి- మొత్తం సాఫ్

ఆయుర్వేదం ప్రకారం.. ఖాళీ కడుపుతో ఒక టీస్పూన్ నెయ్యి, తులసి రసం తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.వాతం, పిత్తం, కఫ దోషాలను తొలగిస్తుంది. వాటిని సమతౌల్యంగా ఉంచుతుంది. ఈ తులసి, నెయ్యి మిశ్రమాలు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తాయి. శ్వాసకోశ, చర్మ సమస్యలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

రోజువారీ జీవనశైలిలో నెయ్యి, తులసి రసం డిటాక్స్ థెరపీగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఓ టీ స్పూన్ నెయ్యి, తులసి రసం మిశ్రమాన్ని రోజువారీ దినచర్యలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో తెలుసుకుందాం.

స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఓజస్ లేదా ప్రాణశక్తికి మూలం. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. మెదడుకు పోషణనిస్తుంది. చర్మ సంబంధిత ఇబ్బందులను నయం చేస్తుంది. కీళ్ల నొప్పులను కూడా తగ్గించే సామర్థ్యం దీనికి ఉంది. ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యి "సత్వ" గుణం కలది. అంటే ఇది మనస్సును ప్రశాంతంగా, నిలకడగా ఉంచడం సహాయపడుతుంది.

దీనికి తులసిని చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. తులసిని ఆయుర్వేదంలో ఎంత ప్రాధాన్యత ఉందో మనకు తెలిసు. ఇది వాతం, పిత్తం, కఫం సంబంధిత ఇబ్బందులను నయం చేస్తుంది. తులసిలో ఉండే సహజసిద్ధమైన యాంటీఆక్సిడెంట్, యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు.. అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది.

తులసి రసం శరీరాన్ని డీటాక్సిఫై చేస్తే, నెయ్యి శరీరానికి పోషణనిస్తుంది. ఈ కలయిక శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేస్తుంది. శక్తిని, రోగనిరోధక శక్తిని, మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది. ఒత్తిడి, అలసట, తరచుగా జలుబు, అజీర్తితో బాధపడేవారికి ఇది ఎంతో ప్రయోజనకరం. ఇది శ్వాసకోశ వ్యవస్థకు ప్రయోజనకరమైనది. తులసి రసం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. నెయ్యి చర్మాన్ని పోషిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ కాంతి పెరుగుతుంది. జుట్టు బలపడుతుంది. శరీరానికి సహజమైన మెరుపును అందిస్తుంది.

ఉదయం ఖాళీ కడుపుతో ఒక టీస్పూన్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకుని, అందులో మూడు నుండి అయిదు చుక్కల తులసి రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా లేదా గది ఉష్ణోగ్రత వద్ద తీసుకోవాలి. తిన్న తర్వాత ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు ఏమీ తినవద్దు. కావాలంటే గోరువెచ్చని నీరు తాగవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+