health tips: డయాబెటిస్ ఉన్నవాళ్ళు దానిమ్మ పండు తినొచ్చా?
మధుమేహం ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఇప్పుడు చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. మధుమేహం ఉన్నవారు ఏ పండు తినాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచించాల్సి వస్తుంది. మధుమేహం ఉన్నవారు నిజంగానే కొన్ని పండ్లను తినకుండా ఉంటేనే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ద్రాక్ష పండ్లు, అరటి పండ్లు, ఖర్జూర పండ్లు, పనస పండ్లు ఇలా కొన్ని పండ్లను తినకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. అయితే దానిమ్మ పండును డయాబెటిస్ బాధితులు తినొచ్చా? దానిమ్మ పండు తింటే ఏం జరుగుతుంది? దానిమ్మ పండు డయాబెటిస్ ను తగ్గిస్తుందా? పెంచుతుందా? ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మ పండ్లు తినవచ్చని, దానిమ్మ పండులో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణాలు, వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరిచే గుణాలు ఉన్నాయని చెబుతున్నారు. డయాబెటిస్ బాధితులకు దానిమ్మ పండు ఆహారంలో అద్భుతమైన ఆహారమని చెబుతున్నారు. ఇతర పండ్ల రసాల కంటే దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రత్యేకంగా ఫాలీ ఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.
అందువల్ల ఇది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, గుండెను రక్షించడంలో కూడా కీలకంగా పనిచేస్తుందని చెబుతున్నారు.మధుమేహం ఉన్నవారు మూడు నెలల పాటు దానిమ్మ రసాన్ని తీసుకుంటే అధిరోస్క్రైకోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు హానికరమైన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని చెబుతున్నారు. దానిమ్మ పండులో ఉండే చక్కెర యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి, ఇది మధుమేహ బాధితులకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అంటున్నారు.
మధుమేహ బాధితుల రక్తంలో చెక్కెర స్థాయిలను ఇది నియంత్రిస్తుంది. దానిమ్మ పండు తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారమని, అధిక చెక్కెర స్థాయిలు ఉన్నవారికి కూడా దానిమ్మ పండు తినడం హాని చేయదని చెబుతున్నారు. అయితే దానిమ్మ పండును తినొచ్చా తినకూడదా? తింటే ఎంత తినాలి? అన్నది మాత్రం కచ్చితంగా వైద్యుడిని అడిగి తెలుసుకున్న తర్వాతనే తీసుకుంటే మంచిదని కూడా వైద్యులు సలహా ఇస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications