Health tips: ఈ ఆరోగ్యసమస్యలు ఉంటే అస్సలు పెరుగు తినొద్దు!!
చాలామంది తమ ఆహారంలో ప్రతిరోజు పెరుగును తీసుకుంటారు. పెరుగును ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిదే అయినప్పటికీ కొంతమంది విషయంలో మాత్రం కాదు . కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పెరుగు తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు వైద్యులు. పెరుగులో క్యాల్షియం, విటమిన్ బీ2, విటమిన్ బి12, పొటాషియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
సాధారణంగా రోజు ఒక గిన్నె పెరుగు తినడం వల్ల చర్మానికి మరియు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పెరుగు శరీరాన్ని డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. అయితే పుల్లటి పెరుగులో కూడా ప్రోబయోటిక్స్ ఉండటం వల్ల అవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే కొన్ని వ్యాధులు ఉన్నవారికి మాత్రం పెరుగు తీసుకోవడం హానికరమని చెప్పచ్చు.

ఎవరు పెరుగును తినొచ్చు.. ఎవరు పెరుగును తినకూడదు.. అంటే .. జీర్ణ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు పెరుగును తీసుకోవడం వల్ల వారికి కడుపు నొప్పి రావడమే కాకుండా మలబద్ధకం సమస్య కూడా ఏర్పడుతుంది. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు పెరుగును తింటే నొప్పులు మరింత పెరుగుతాయి. పెరుగు వాతాన్ని మరింత పెంచుతుంది. ఆస్తమా ఉన్న వారు పెరుగును తింటే ఉబ్బసం మరింత పెరుగుతుంది.
ఎసిడిటీ, గ్యాస్ సమస్య ఉన్నవారు పెరుగు తింటే ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. ఎగ్జిమా, దురద, ఇన్ఫెక్షన్ మరియు మొటిమల వంటి సమస్యలు ఉన్నవారు, ఏదైనా చర్మ సమస్యతో బాధపడుతున్న వారు పెరుగును తినకుండా ఉండటమే మంచిది. వారు ఒకవేళ పెరుగు తింటే ఆ సమస్య మరింత పెరుగుతుంది.
మహిళల్లో వైట్ డిస్చార్జ్ సమస్య ఉన్నవారు పెరుగు తినకుండా ఉండాలి. అలాంటివారు ఎక్కువగా పెరుగును తినడం వల్ల వైట్ డిశ్చార్జ్ సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పెరుగును తినకుండా ఉండటమే మంచిదని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా పెరుగును తినాలి అంటే అలాంటి వారు పెరుగును మజ్జిగ రూపంలో చేసుకుని తాగితే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications