health tips: రాత్రిపూట ఆహారంలో ఇవి తినటం ప్రమాదకరం!!
రాత్రి సమయంలో చాలా మంది ఆహారం తినేటప్పుడు తినకూడని ఆహారాన్ని తింటూ ఉంటారు. అది ఆరోగ్యానికి చేటు చేస్తుంది. అనేక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. అందుకే రాత్రిపూట ఆహారాన్ని తినే వారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు? అసలు రాత్రి ఆహారాన్ని ఏ సమయంలో తీసుకోవాలి? వంటి విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
రాత్రి సమయంలో చాలామంది చాలా ఆలస్యంగా ఆహారం తింటూ ఉంటారు. అది మంచిది కాదని చెబుతున్నారు. నిద్ర కు ఉపక్రమించే నాలుగు గంటల ముందే ఆహారాన్ని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఏడు గంటల లోపే రాత్రి భోజనం ముగించుకోవటం మంచిదని చెబుతున్నారు. రాత్రి భోజనం చెయ్యగానే పడుకోవటం కూడా ఏ మాత్ర శ్రేయస్కరం కాదని చెప్తున్నారు.

రాత్రి సమయాలలో తప్పు ఆహారం తీసుకోవడం వల్ల అది శరీరానికి హాని కలిగిస్తుంది. చాలామంది రాత్రిపూట ఆహారంతో ఉల్లిపాయలను తినడానికి ఇష్టపడతారు. అయితే అది ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కడుపులో గ్యాస్ సమస్య ఉత్పన్నమవుతుంది. రాత్రి సమయాల్లో టమాటాలను తినటం కూడా మానుకోవాలి. రాత్రి సమయాల్లో టమోటోలను తినడం కూడా జీర్ణ వ్యవస్థ పై ప్రభావాన్ని చూపిస్తుంది.
రాత్రి వేళల్లో స్పైసీ ఫుడ్ కు దూరంగా ఉండటం చాలా మంచిదని చెబుతున్నారు. రాత్రి వేళల్లో మసాలా ఆహారం తినకూడదని అంటున్నారు. అంతేకాదు రాత్రివేళ మిరపకాయలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల నిద్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని చెబుతున్నారు. చాలామంది రాత్రివేళల్లో డ్రైఫ్రూట్స్ తింటూ ఉంటారు. అయితే డ్రైఫ్రూట్స్ రాత్రివేళల్లో తినడం వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుందని అది ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు.
ప్రశాంతంగా హాయిగా నిద్ర పోవాలి అనుకునేవారు రాత్రివేళ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏ సమయంలో ఏమి తినాలో అందరూ తెలుసుకోవాలని చెప్తున్నారు న్యూట్రిషనిస్టులు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications