పురుషులకు వెరీ బ్యాడ్‌న్యూస్ చెప్పిన who

మద్యం తాగడంవల్ల ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 30 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. మద్యం, ఆరోగ్యానికి సంబంధించి డబ్ల్యూహెచ్ వో తాజాగా ఒక నివేదికను వెల్లడించింది. ఆల్కహాల్ తాగి వాహనాలను నడుపుతుండటం ప్రధాన కారణమని వెల్లడించింది. మరణించినవారిలో మూడోవంతు పురుషులే ఉంటున్నారు. మత్తుపానీయాలను వినియోగించడంవల్ల వ్యక్తిగత ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని, మానసిక ఆరోగ్యంపై ప్రభావంతోపాటు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతోందని సంస్థ వెల్లడించింది.

తగ్గిన ఆల్కహాల్ వినియోగం
అయితే ఇందులో ఉన్న సానుకూలమైన అంశం ఏమిటంటే 2010 నుంచి ప్రపంచవ్యాప్తంగా మద్యం తీసుకోవడం కొంతవరకు తగ్గింది. అయితే మద్యం వల్ల ఆరోగ్యం, సామాజిక భారం ఎక్కువగానే ఉంది. 2019లో సంభవించిన మరణాల్లో 20 నుంచి 39 సంవత్సరాల్లోపు ఉన్నవారు 13 శాతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కొన్నిరకాల వ్యాధులు మద్యపానం సేవించడంవల్లే వస్తున్నాయి. ఈ ఏడాదిలో నాలుగు లక్షల మంది క్యాన్సర్ వల్ల, ఏడు లక్షల మంది ట్రాఫిక్ ప్రమాదాలతో మరణించారు. 2019లో 209 మిలియన్ల మందికి మద్యం తాగే అలవాటుంది. ప్రపంచ జనాభాలో ఇది 3.7 శాతంగా ఉంది.

Healthy foods to eat while drinking alcohol who

ముస్లిం దేశాల్లో చాలా తక్కువ
ప్రపంచవ్యాప్తంగా మద్యం తలసరి వినియోగం 2011 లో ఉన్న 5.7 లీటర్ల నుంచి 2019లో 5.5 లీటర్లకు తగ్గింది. ప్రపంచ జనాభాలో 15 సంవత్సరాలకు పైబడినవారిలో సగం మంది మద్యానికి దూరంగా ఉన్నారు. యూరప్ దేశాల్లో ఎక్కువ మంది ఆల్కహాల్ తీసుకుంటున్నారు. అక్కడ సగటున 9.2 లీటర్ల ఆల్కహాల్ తాగుతున్నారు. అదే అమెరికాలో అయితే 7.5 లీటర్లగానే ఉంది. ఉత్తర ఆఫ్రికా, మిడల్ ఈస్ట్, ఆసియా దేశాల్లో మద్యం వినియోగం చాలా తక్కువగా ఉంది. మహ్మదీయులు నివసించే దేశాల్లో వినియోగం తక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+