కోడిగుడ్లను రెగ్యలర్ గా తింటున్నారా..అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!
కోడిగుడ్లల్లో మనకు కావల్సిన విటమిన్లు, ఖనిజ లవణాలు అనేకం ఉంటాయి. శరీరానికి అవసర మయ్యే పోషకాలను అతి తక్కువ ధరలో అందించే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిని తీసుకోవడం వల్ల మెదడు అభివృద్ది చక్కగా ఉంటుంది. ఇక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచ డంలో కూడా గుడ్లు మనకు తోడ్పడతాయి. అయితే, కోడిగుడ్లు తినటం పైన కొందరిలో కొన్ని అపోహలు ఉన్నాయి. అసలు రెగ్యలర్ గా తినచ్చా.. ఎన్ని తినాలి.. ఏ సమయంలో తినాలి అనే సందేహాల పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
గుండె ఆరోగ్యానికి గుడ్లు మేలు చేసేవే అయినప్పటికీ వీటిని అధికంగా తీసుకోకుండి పరిమితంగా ఆహారంగా మార్చుకుంటే ప్రయోజనం ఉంటుంది. కోడిగుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. కోడిగుడ్డులో దాదాపు 180 నుండి 300 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది అంతా కూడా పచ్చసొనలోనే ఉంటుంది. గుడ్డు తెల్లసొనలో కొలెస్ట్రాల్ ఉండదు. గుడ్డు గుండె ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కొందరికి సమస్యలు వస్తాయి. దీంతో గుండె సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యడి సలహా మేరకే కోడిగుడ్డు వినియోగించటం మంచింది. ఇక ఈ గుడ్లను చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్, శుద్ది చేసిన పిండి వంటి వాటితో కలిపి కేక్స్, కుకీస్ వంటి ఆహారాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. దీంతో ఈ క్యాలరీల రేటు మరింత పెరిగి ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది.

దీంతో, గుండెకు మేలు జరగడం పోయి గుండె జబ్బులు, అధిక బరువు, మధుమేహం, శరీరంలో కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక గుడ్లను తగిన మోతాదులో తీసుకోవడం కూడా చాలా అవసరం. కాగా.. ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ చెబుతున్న ప్రకారం మనం రోజుకు 300 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ కలిగిన ఆహారాలను తీసుకోవచ్చు. ఒక గుడ్డులో దాదాపు 180 నుండి 300 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక మనం వారానికి 3 నుండి 4 గుడ్లను తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాగే గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్న వారు వారానికి 3 గుడ్లను తీసుకోవచ్చు. ఇక ఈ గుడ్లను వివిధ వంటకాల్లో భాగం చేయడానికి బదులుగా వీటిని నేరుగా ఉడికించి తీసుకున్నప్పుడే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. గుడ్డులోని పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయి. ఇలా తగిన మోతాదులో ఉడికించి తీసుకున్నప్పుడే గుడ్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications