helath tips: కిడ్నీలలో రాళ్ళను నేచురల్ గా కరిగించెయ్యండి; ఈ రెమిడీస్ ట్రై చెయ్యండి!!
కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారా? అయితే కిడ్నీలో రాళ్లను సహజంగా కరిగించుకోవడానికి ఈ రెమెడీస్ ప్రయత్నించండి.
ప్రస్తుతం మనం సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, తగినంత నీటిని తాగకపోవడం, విపరీతమైన పని ఒత్తిడి వంటి కారణాలతో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఏ ఇంట్లో చూసినా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వారే ప్రస్తుతం తారస పడుతున్నారు. ఇక ఇటీవల కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్యలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. స్థూలకాయ బాధితులు, సరైన జీవన శైలి లేని వాళ్ళు ఈ కిడ్నీలో రాళ్ల సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది.

కిడ్నీలో రాళ్ళు.. కరిగిపోవాలంటే ఏం చెయ్యాలి
కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి అంటే మూత్రపిండాలలో మినరల్స్ స్పటిక రూపంలో గడ్డలుగా ఏర్పడతాయి. ఇక వీటిని కిడ్నీలో రాళ్లుగా మనం భావిస్తూ ఉంటాం. కిడ్నీలో రాళ్లు ఉంటే అవి తీవ్రమైన బాధను కలిగిస్తాయి. చిన్న చిన్న రాళ్లయితే మూత్రం ద్వారా విసర్జించబడతాయి కానీ మరీ పెద్దగా ఉన్న రాళ్లయితే అవి కిడ్నీలలోనే ఉండి మనల్ని తీవ్రంగా బాధపెడతాయి. అయితే కిడ్నీలో రాళ్లు కరిగిపోవాలి అంటే వాటిని నివారించడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఇక అవేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కిడ్నీలో రాళ్ళు కరిగిపోవటానికి ఇవి చెయ్యండి
కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మనం ఎక్కువగా నీటిని తాగాలి. ఎక్కువగా నీటిని తాగడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లు కరిగిపోయే అవకాశం ఉంటుంది. అంతే కాదు వీలైనంత ఎక్కువగా నిమ్మరసం తాగుతూ ఉండాలి. ఇక కిడ్నీలో రాళ్లు త్వరగా కరిగిపోవాలి అంటే దానిమ్మ పండు జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మెగ్నీషియం ఎక్కువ లభించే ఆహార పదార్థాలను మన మెనూలో చేర్చుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చిక్కుడు గింజలతో కూడిన ఆహారాన్ని తినడం వల్ల కూడా కిడ్నీల సమస్య పరిష్కారం అవుతుంది.

రాళ్ళు పోవాలంటే ఈ రెమిడీస్ ట్రై చెయ్యండి
అంతేకాదు కిడ్నీలో రాళ్లు పోవాలంటే రాత్రిపూట మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీళ్లను ఉదయాన్నే తాగడం వల్ల కూడా రాళ్లు కరిగిపోతాయి. కాల్షియం సిట్రేట్ కు రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంటుంది కాబట్టి క్యాల్షియం సిట్రేట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి ఇక కొత్తిమీర ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి, గ్లాసు నీళ్లలో పది నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

ఈ ఆహారాల విషయంలో జాగ్రత్త
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు రాళ్లు ఏర్పడడానికి కారణమయ్యే ఆహార పదార్థాలను తినకుండా ఉండడం మంచిది. వాటిలో ముఖ్యంగా టమాట, పాలకూర, సోయా, ఎండు చిక్కుడు తినకుండా ఉంటేనే మంచిది. నేచురల్ విధానంలో కిడ్నీలో రాళ్ళ నుండి ఉపశమనం పొందేందుకు ప్రయత్నం చెయ్యాలి. అలా సాధ్యం కాకపోతే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications