బరువు తగ్గాలా? చికెన్ తో వెజ్ సలాడ్ ఒక్క మూడు నెలలు తినండి!
ప్రోటీన్ అధికంగా ఉండే చికెన్, కూరగాయల సలాడ్‌లు మన శరీరంలో చెడు కొవ్వును తగ్గించటానికి బాగా దోహదం చేస్తాయి. ఇవి లీన్ ప్రోటీన్, పీచు పదార్థం, తక్కువ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌లను అందిస్తాయి. మనం బరువు బాగా పెరిగి తగ్గాలని భావిస్తుంటే వ్యాయామంతో పాటు డైట్ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కొవ్వు తగ్గడానికి చికెన్ వెజ్ సలాడ్‌లు
మనం బరువు తగ్గటం కోసం కార్బోహైడ్రేట్ లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినటం ఆపి, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినటం అలవాటు చేసుకోవాలి. చికెన్ బ్రెస్ట్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, కొవ్వు చాలా తక్కువ ఉంటుంది. వివిధ రకాల కూరగాయలు పీచు పదార్థాన్ని, మన శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలను అందిస్తాయి.ఇది మన ఆకలిని తగ్గిస్తుంది. పొట్ట నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది.

గ్రిల్డ్ చికెన్ మరియు వెజ్ సలాడ్
గ్రిల్డ్ చికెన్ ముక్కలు, సన్నగా తరిగిన కీరా దోసకాయ, టమాటో, ఉల్లిపాయలను, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్, తురిమిన క్యాబేజ్, ఒక పచ్చి మిర్చి ఒక గిన్నెలో తీసుకోండి. దీనికి కొత్తిమీర, తాజా నిమ్మరసం కలపండి. చిటికెడు మిరియాలపొడి, కొద్దిగా ఉప్పుతో రుచి సరిచూసుకోండి. ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ మాత్రమే వాడండి, అంతకు మించి కాదు. మెరుగైన రుచి కోసం చల్లగా ఉండేలా ఫ్రిజ్ లో పెట్టి ఉపయోగించుకుంటే మంచిది.
చికెన్ ఇలా ఎలా తిన్నా బెస్ట్ నే
చికెన్ ను గ్రిల్ లా కానీ, తందూరీ లా కానీ, చికెన్ ఉడకబెట్టి కానీ ఈ వెజ్ సలాడ్ లో వేసుకుని తినండి. ఇది మీకు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. అయితే చికెన్ వెజ్ సలాడ్ తినేవారు ఇందులో క్రీమ్ లను ఉపయోగించవద్దు. పెప్పర్, సాల్ట్, ఆలివ్ ఆయిల్ తో డ్రెస్సింగ్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి.
మూడు నెలలు ఆహారం ఇలా తీసుకుంటే మీ శరీరంలో మార్పు
వీటిని క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి నిద్రతో పాటు తీసుకోవడం ముఖ్యం. కేలరీల లోటును సాధించడానికి తీసుకునే ఆహార మోతాదు విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి, నిర్దిష్ట మోతాదులోనే తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు క్రమంగా పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడానికి ఎంతగానో దోహదపడతాయి. మూడు నెలలు ఇలా చేసి చూడండి.. మీ శరీరంలో మార్పును మీరే గమనించండి.
-
చుక్కకూర మటన్ కర్రీ సూపర్ టేస్ట్.. ఇలా చేస్తే అన్నం మెతుకు కూడా వదిలిపెట్టరు -
ఉపాసన చెప్పిన సింపుల్ స్పెషల్ రాగి జావ.. ఇలా చేస్తే బలం! -
"మిల్ మేకర్ బ్రెడ్ ఆమ్లెట్" ఇలా చేస్తే ముక్క కూడా వదలరు !! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications