అద్భుతం.. క్షణాల్లో షుగరు తగ్గిపోతుంది
మధుమేహం అనేది దాదాపుగా అంటువ్యాధి స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల మందికి పైగా ప్రజలు షుగరు వ్యాధితో బాధపడుతున్నారు. భారతదేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య 10 కోట్లకు పైగా ఉంది. దీనికి చికిత్స లేదు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు కానీ, దీనికి మందులు ఒకటేకాదు.. ఆహారం, జీవనశైలిలో మార్పులు కూడా చేసుకోవాలి.
ఉల్లిపాయ మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల నుండి చాలా వరకు విముక్తి ప్రసాదిస్తుందని ఒక సర్వేలో తేలింది. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఉల్లిపాయ సారం అద్భుత ప్రభావాన్ని చూపుతుందని బ్రిటిష్ వెబ్‌సైట్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. మధుమేహాన్ని నియంత్రించడానికి మనకు అందుబాటులో ఉన్న చౌకైన మార్గం ఉల్లిపాయ రసం.

ఉల్లిపాయ రసం రక్తంలో చక్కెరను 50% తగ్గిస్తుంది. ఈ అధ్యయనం ప్రకారం ఉల్లిపాయ సారం మధుమేహంలో ఔషధాల వలె ప్రభావవంతంగా ఉంటుంది. ఎలుకలపై దీన్ని ప్రయోగించి చూడగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. అమెరికాలో సైన్స్‌పై జరిగిన వార్షిక సదస్సులో శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను సమర్పించారు.
ఉల్లిపాయ రసం ఇచ్చిన ఎలుకలకు కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉన్నాయి. ఎటువంటి సమస్యలు ఎదురవలేదు. మధుమేహం వంటి అనేక సమస్యల నుంచి బయటపడటమే కాకుండా కొలెస్ట్రాల్‌ను దూరం చేయడంలో ఉల్లిపాయ ఎంతగానో సహకరిస్తుందని తేలింది. మధుమేహాన్ని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పకుండా వ్యాయామం, పర్యవేక్షణ, బరువు నియంత్రణ, సమతుల్య ఆహారం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications