ఆరోగ్యాన్నిచ్చే హాట్ అండ్ టేస్టీ టమాటా రైస్.. ఇలా చేస్తే మెతుకు కూడా వదలరు!

చలికాలం త్వరగా అయ్యే వంట ఏంటి? పిల్లలు ఇష్టంగా తినేది ఏంటి? వేడివేడిగా కారం కారంగా తక్కువ సమయంలో తయారు చేయగలిగింది ఏంటి? సమయాన్ని ఆదా చేయడంతో పాటు వేగంగా వండుకొని తినగలిగింది ఏమిటి? అంటే టమాటా రైస్ అని కచ్చితంగా చెప్పొచ్చు. తినడానికి రుచిగా, చలికాలంలో హాట్ హాట్ గా ఉండే టమాటా రైస్ ని ఏ విధంగా తయారుచేయాలి? దీంతో కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి? అనేది తెలుసుకుందాం.

టమాటా రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు

బియ్యం- ఒక కప్పు

టమాటాలు- 4 పెద్దవి

పచ్చిమిరపకాయలు- రెండు

కరివేపాకు- 2 రెమ్మలు

అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక స్పూన్

కూరగాయలు- ఏవైనా ఇష్టాన్ని బట్టి

నూనె- ఒక టేబుల్ స్పూన్

పోపు గింజలు- ఒక స్పూన్

పసుపు- పావు స్పూన్

ఉప్పు- స్పూన్ న్నర

కొత్తిమీర- కొద్దిగా

hot and tasty Tomato Rice with full of health benefits make easily

తయారీ విధానం

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక పావుగంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టి నూనె వేసి పోపు గింజలు వేసి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఆపై అందులో చిన్నగా కట్ చేసిన టమాటాలు, పసుపు, ఉప్పు వేసి టమాటా మెత్తగా ఉడికే లాగా అందులో ఇష్టమైతే కొన్ని కూరగాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి.

ఇలా చేస్తే టమాటా రైస్ టేస్టీ గా

ఆపై నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు రాకుండా కుక్కర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో బియ్యం క్వాంటిటీని బట్టి ఒక కప్పు బియ్యం వేస్తే కొంచెం తక్కువ రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, విజిల్ వదిలిన తర్వాత మూతతీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన టమాటా రైస్ రెడీ అవుతుంది.

టమాటా రైస్ తో ఆరోగ్య ప్రయోజనాలు

ఇది పిల్లల లంచ్ బాక్స్ లో కూడా చాలా బాగుంటుంది.టమాటా రైస్ తో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. టమాటాల్లో ఉండే లైకోపీన్ వల్ల ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది. జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేసి తక్షణ శక్తిని ఇస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+