వేసవిలోనూ ఉదయాన్నే గోరు వెచ్చని నీటిని తాగుతున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!!
గోరు వెచ్చని నీరు శరీరంలో జీవక్రియల పని తీరును మెరుగు చేస్తుంది. చాలా మంది ఉదయం లేచిన వెంటనే గోరు వెచ్చని నీరు తీసుకోవటం అలవాటు. ఆయుర్వేదం ప్రకారం రోజూ మనం గోరు వెచ్చని నీళ్లను తాగటం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. గోరు వెచ్చని నీళ్లను ఉదయం పరగడుపునే తాగితే సహజసిద్ధమైన క్లీన్సర్‌లా పనిచేస్తాయి. ఈ నీళ్లను తాగడం వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్లు బయటకు పోతాయి. కిడ్నీలు సైతం శుభ్రంగా మారుతాయి. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే, వేసవి కాలంలో ఈ నీటిని తీసుకొనే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిపుణులు సూచిస్తున్నారు.
ఏ కాలంలో అయినా గోరు వెచ్చని నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, పరిస్థితిని బట్టి చల్లటి నీరు లేదా వేడి నీరు తాగాలి. సాధారణంగా మరిగించి చల్లార్చిన నీరు తాగడం ఆరోగ్యానికి మంచి ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గోరు వెచ్చని నీళ్లను తాగితే మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. తలలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లను సేవించడం గొంతు నొప్పి, గొంతులో మంట, గరగర వంటి సమస్యలు ఉన్నవారు గోరు వెచ్చని నీళ్లను తాగుతుండాలి. దీంతో ఎంతో ఉపశమనం లభిస్తుంది. పేగులకు రక్తప్రవాహం పెరుగు తుంది. జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే, 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన నీటిని పొట్ట చలనశీలత కోసం తీసుకోవడం మంచిది. 50 నుండి 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన నీటిని గ్యాస్, ఉబ్బరం, అజీర్తి వంటి లక్షణాలను తగ్గించడానికి తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇక ఉదయం పూట గోరు వెచ్చని నీటిని తీసుకోవడం వల్ల మనం తీసుకునే అల్పాహారం మరింత సమర్థవంతంగా విచ్చినం అవుతుంది. ఆమ్లత్వం తగ్గుతుంది.

ఉదయం వేళ వేడి నీటితో ఎన్నో ప్రయోజనాలు
ఖాళీ కడుపుతో నీటిని తాగడం వల్ల ప్రేగు కదలికలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మలబద్దకం సమస్య తగ్గుతుంది. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మూత్రపిండాలు వ్యర్థాలను సమర్థవంతంగా బయటకు పంపిస్తాయి. శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. అంతేకాకుండా వేడి నీటిని తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అవయవాలకు ఆక్సిజన్ మరింత సమర్థవంతంగా అందుతుంది. వేడి నీటిని తాగడం వల్ల మనం సులభంగా బరువు కూడా తగ్గవచ్చు. ఉదయం పూట గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం పెరుగు తుంది. నిల్వ ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. అయితే, ఉదయం పూట వేడి నీటిని తాగడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మనం తాగే నీరు 60 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి లేకుండా చూసుకోవాలి. ఎక్కువ వేడి ఉన్న నీటిని తాగడం వల్ల నాలుక సున్నితమైన పొర దెబ్బతింటుంది. దంతాలపైఉండే ఎనామిల్ కాలక్రమేణా బలహీనపడుతుంది. వేడి నీరు కొందరిలో యాసిడ్ రిఫ్లెక్స్ ను పెంచుతుంది. ఖాళీ కడుపుతో తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తాగడం వల్ల రక్తంలో సోడియం స్థాయిలు పలుచగా అవుతాయి. వెచ్చని నీరు తాగడం వల్ల శరీరానికి, జీర్ణ వ్యవస్థకు మంచిదే అయినప్పటికీ నీటిని తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా దృష్టిలో ఉంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
-
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications