వాకింగ్ ఎంత సేపు చేయాలి.. అతిగా నడిస్తే ఏం జరుగుతుంది..!?
వాకింగ్. ఆరోగ్యంగా ఉండేందుకు అద్భుతమైన వ్యాయామ ప్రక్రియ. నిత్యం నడక చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని వైద్యులు సైతం స్పష్టం చేనస్తున్నారు. వయసు.. ఆరోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకొని ఎంత సేపు నడవాలి.. ఎన్ని అడుగులు నడవాలి అనేది వైద్యులు సూచిస్తారు.సాధారణంగా 8,000 నుంచి 10,000 అడుగుల వరకు నడవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయి. దీని వల్ల షుగర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి, గుండె సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి. అయితే, అతిగా నడక కారణంగా సమస్యలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నడక అందరికీ మంచిదే. అయితే, అది పరిమితి మించనంత వరకే. వయసు.. ఆరోగ్య సమస్యల కు అనుగుణంగా రోజు ఎంత దూరం నడవాలి.. ఎన్ని అడుగులు నడవాలి అనేది వైద్యులు నిర్ధారణ చేస్తారు. దీనికి అనుగుణంగా ప్లానింగ్ చేసుకోవటం ఉత్తమం. నడక అందరికీ ఒకేలా వర్తించదు. మీ వయస్సు, ఆరోగ్యం, జీవనశైలి ఆధారంగా ఇది మారవచ్చు.శరీరం శక్తి మేరకు నడక పరిమితి ఉండాలి. కొత్తగా నడక ప్రారంభించిన వారు 30 నిమిషాలు నడిస్తే కొద్ది రోజులు కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడతారు. అయితే, అలవాటు అయిన తరువాత సమస్యలు ఉండవు. శరీరం ఇచ్చే సంకేతాలకు అనుగుణంగా నడక కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. వయసు తో పాటుగా శరీరంలో సమస్యలను సైతం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

అధిక నడక వల్ల సమస్యలకు అవకాశం ఉంది. వయసు పెరిగిన వారికి ఎక్కువగా నడవడం వల్ల కీళ్లపై ఒత్తిడి పెరిగి సమస్యలు వస్తాయి. నడకకు వినియోగించే బూట్లు విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పులు.. చదును కాని ప్రాంతాల్లో నడక వలన కొత్త ఇబ్బందులు ఏర్పడుతాయి. శరీర శక్తికి మించి ఎక్కువగా నడిస్తే శరీరం అలసిపోయినట్లు అనిపించడం, చిన్న పని చేసినా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం వంటి లక్షణాలు ఎక్కువగా నడుస్తున్నారని సూచిస్తాయి. నడక మనసుకు శాంతిని ఇవ్వగలిగే శక్తి ఉన్నా.. హద్దు మించి చేస్తే ఆందోళన, నిరాశ, కోపం వంటి భావోద్వేగాలు పెరిగే ఛాన్స్ ఉంటుందని నిపుణుల మాట. దీంతో.. కొత్తగా నడక ప్రారంభించే వారు ముందుగా కొద్ది రోజుల పాటు 15 నిమిషాలే నడవాలి. వారం తరువాత క్రమేణా పెంచుకుంటూ 30 నిమిషాల వేగవంతమైన నడవటం ఉత్తమం. దీంతో, నడక మంచిదే అయినా పరిమితులు మాత్రం తెలుసుకొని.. ముందుకు సాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications