షుగరు రమ్మన్నా రాదు.. అంతే!

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ ఇన్సులిన్‌ హార్మోన్‌కు శరీర కణాలను సమర్థవంతంగా స్పందించకపోతే దాన్ని ఇన్సులిన్‌ నిరోధకత అంటారు. కణాలు గ్లూకోజును స్వీకరించలేకపోవటం వల్ల రక్తంలో దీని స్థాయులు పెరుగుతాయి. ఇన్సులిన్‌ నిరోధకత టైప్‌2 డయాబెటిస్‌తోపాటు కొన్ని అనారోగ్యాలకు కారణమవుతుంది. అందుకే ఇన్సులిన్ సెన్సివిటీని తగ్గించాలి. అందుకు నాలుగు మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ఆహారంలో మార్పులు
పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్ల వంటి సంపూర్ణ ఆహారాలపై దృష్టిపెట్టాలి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే ఇన్సులిన్ సెన్సివిటీ తగ్గుతుంది. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, స్వీట్స్‌, ప్రాసెస్‌చేసిన ఆహారాలను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.

how to control blood sugar levels

క్రమం తప్పని వ్యాయామం
ప్రతిరోజు కచ్చితంగా వ్యాయామం చేయాలి. ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి. వ్యాయామం చేయడంవల్ల కండరాలు ఇన్సులిన్ కు మరింత స్పందించేలా చేస్తుంది.
వాకింగ్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌, ఏరోబిక్‌వంటివి చేయాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. చక్కెర స్థాయిలు సహజంగానే తగ్గుతాయి.

బరువు కంట్రోల్‌లో ఉండాలి
కచ్చితంగా బరువు తగ్గాలి. అలా బరువు తగ్గడంవల్ల బ్లడ్‌షుగర్‌లెవల్స్‌, ఇన్సులిన్‌సెన్సిటివిటీపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. బరువు పెరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

ఒత్తిడి తగ్గించుకోవాలి
ఒత్తిడిని నియంత్రించుకోవాలి. కొందరు దీర్ఘకాలిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. ధ్యానం, యోగా, సంగీతం వినడం లాంటివి తరుచుగా చేస్తుండాలి. ప్రతిరోజు ఏడు నుంచి 9 గంటలపాటు నిద్ర ఉండాలి. సాధ్యమైనంత తొందరగా నిద్రపోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+