సులభంగా, ఆరోగ్యంగా బరువు తగ్గడం ఇలా?
ఆహారంలో అవిసె గింజలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
మనుషుల రోజువారీ అలవాట్లు మారిపోవడంతోపాటు మారిన జీవనశైలి, తీసుకునే ఆహారం, నలుగురితో మాట్లాడుతూ తినడం, టీవీ చూస్తూ తినడంలాంటివాటివల్ల బరువు పెరుగుతున్నారేకానీ తగ్గడంలేదు. ఆయుర్వేద నిపుణులు మాత్రం కఠినమైన వ్యాయామాలకు బదులుగా పలు చిట్కాలను ఉపయోగించడంవల్ల మంచి ఫలితాలు రాబట్టవచ్చని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లతోపాటు పలురకాల విత్తనాలు తినడంవల్ల పొట్టచుట్టూ చేరే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
ఆహారంలో అవిసె గింజలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని, అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. అయితే వీటిని ప్రతి రోజూ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

అవిసె గింజలలో ఉండే పోషకాలు:
అవిసె గింజల్లో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా దీనిని సూపర్ ఫుడ్స్ అని కూడా అంటారు. శరీరంలో మార్పులు సంభవించడమే కాకుండా దృఢంగా కూడా మారుతుంది. ఇందులో ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, ఫినోలిక్ సమ్మేళనాలు లభిస్తాయి కాబట్టి ప్రతి రోజూ వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అవిసె గింజలు బరువును ఎలా తగ్గిస్తాయి?
అవిసె గింజలు అనేక వ్యాధులను తగ్గించడానికి సహాయపడతాయి. ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల పెరుగుతున్న శరీర బరువును సులభంగా నియంత్రిస్తుంది. అంతేకాకుండా పొట్ట చుట్టూ పేరుపోయిన కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రించడానికి సహాయపడుతుంది. కాబట్టి సులభంగా ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాలి.

లిన్సీడ్ విత్తనాలను ఎలా తీసుకోవాలి?:
పాలు, ఆపిల్ స్మూతీలో కలిపి లిన్సీడ్ గింజలను తీసుకోవడంవల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఒక కప్పు పాలు, 2 ఖర్జూరాలను మిక్సర్ గ్రైండర్లో వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఆ స్మూతీని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు












Click it and Unblock the Notifications