మీ కిడ్నీల ఆరోగ్యం మీ చేతుల్లోనే - ఈ పొరపాట్లు చేయద్దు..!!
కిడ్నీలు ముఖ్యమైన అవయవం. ఇవి రక్తాన్ని శుభ్రపరిచి, వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. ఇతర అవయవాల మీద ఉన్న శ్రద్ద కిడ్నీల పైన కొందరు చూపటం లేదు. ఫలితంగా కిడ్నీ సమస్యలు, రాళ్లు సహా ఇతర సమస్యల బారిన పడుతున్నారు. దీంతో, కిడ్నీ సమస్యలు రాకుండా ఉండేలా కొన్ని సూచనలు వైద్యులు చేస్తున్నారు. మూత్ర పిండాల వ్యాధి నరాలు, ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది చివరికి గుండె జబ్బులు, స్ట్రోక్, రక్తహీనతకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నీరు తాగటం చాలా ముఖ్యం. హైడ్రేట్ గా ఉండటం మూత్రాన్ని పలుచగా ఉండటంతో పాటుగా రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని వివరించారు. కనీసం ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని సూచిస్తున్నారు. తాజా పండ్లు, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు లేదా కొవ్వు రహిత పాల ఉత్పత్తులు కిడ్నీ ఆరోగ్యా న్ని పెంచుతాయి. అధిక సోడియం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొవ్వులు అధికంగా ఉన్న పదార్థా లకు దూరంగా ఉండాలిని హెచ్చరిస్తున్నారు. రక్తపోటు నియంత్రణ లో లేకపోతే కిడ్నీలోని రక్త నాళాల మీద ఒత్తిడి పెరుగుతుంది. మూత్ర పిండాల ఆరోగ్యానికి వ్యాయామం ఉపకరిస్తుంది.

రక్తంలో మోతాదు మించిన షుగర్ లెవల్స్ ఉండటం వల్ల దీర్ఘకాలంలో మూత్రపిండాలను దెబ్ బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల మూత్ రపిండాల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్ వంటి కొన్ని నొప్పి నివారణ మందులు అధిక మోతాదులో లేదా దీర్ఘకాలంగా ఉప యోగించినప్పుడు కిడ్నీలకు హాని కలిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం రక్తనాళాలను దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజువారీ అలవాట్లను క్రమం తప్ప కుండా పాటించడం వల్ల మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చుని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications