యువతలో విపరీతమైన చెమటతో ఈ రోగాలకు లింక్.. జాగ్రత్త!
అధిక చెమట... దీనిని హైపర్ హైడ్రోసిస్ అంటారు. ప్రస్తుతం భారతీయ యువతను ఎక్కువగా ఈ సమస్య ప్రభావితం చేస్తుంది. అయితే ఇది రెండు రకాలుగా ఉంటుందని ఒకటి జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి వచ్చే ప్రాథమిక హైపర్ హైడ్రోసిస్ అయితే రెండవది వైద్య పరిస్థితుల కారణంగాను, మందుల కారణంగానూ కలుగుతున్న హైపర్ హైడ్రోసిస్ అని చెబుతున్నారు. అయితే అధికచెమట ఇది సాధారణమైన సమస్యగా కనిపించినప్పటికీ అనేక అనారోగ్య పరిస్థితులతో ముడిపడి ఉంటుంది.
అధిక చెమటకు అనారోగ్యాలకు లింక్
అధికంగా చెమట పోయడానికి, మన శరీరంలో ఇతర అనారోగ్య సమస్యలకు ఒక లింకు ఉంటుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారిలో అధికంగా చెమట పట్టడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రాత్రిపూట చెమట పోస్తుంది. ఇక హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న వారిలోనూ అధిక చెమట సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆందోళన మరియు ఒత్తిడితో కూడుకున్న జీవితం గడిపేవారిలోనూ అధిక చెమట సమస్య కనిపిస్తుంది.

ఈ కారణాలతోనూ అధిక చెమట
కొన్ని రకాల గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు కూడా అధిక చెమట సమస్యను ఎదుర్కొంటారు. హార్మోనల్ ఇన్ బాలన్స్ తో బాధపడేవారు అధిక చెమట సమస్యను ఎదుర్కొంటారు. థైరాయిడ్ గ్రంధి ఎక్కువ హార్మోన్లను విడుదల చేసినప్పుడు కూడా అధిక చెమటకు దారితీస్తుంది. ఇక కొన్ని రకాలైన మందుల దుష్ప్రభావాలు అధిక చెమటకు కారణమవుతాయి. నొప్పి నివారణ మందులు వాడుతున్నప్పుడు అవి అధిక చెమటకు కారణంగా మారుతాయి.
అధిక చెమటతో పాటు ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త
అంతేకాదు మన శరీరంలో కొన్ని రకాల క్యాన్సర్ల కారణంగా కూడా రాత్రి వేళల్లో చెమటలు పట్టే అవకాశం ఉంటుంది. కనుక అధిక చెమట విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అధిక చెమటతో పాటు ఇతర లక్షణాలు కూడా కనిపిస్తున్నప్పుడు అసలే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. తగిన వైద్య చికిత్సలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
యువత .. బీ కేర్ ఫుల్
సాధారణంగా విపరీతమైన చెమట అనేది అనారోగ్య కారణాలతోనో, వ్యాధి వలననో సంభవించకపోయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో వ్యాధి పరమైన కారణాలు ఉంటాయి కాబట్టి ఈ సమస్య విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ముఖ్యంగా యువత ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా ఇందుకు గల కారణాలు తెలుసుకుని జాగ్రత్త పడాలి.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
'వెయిట్ లాస్ సూప్'.. ఇలా చేసుకుని తాగితే వెయిట్ లాస్ గ్యారంటీ..!! -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
మళ్లీ మళ్లీ తినాలనిపించే "పీతల బిర్యానీ" ఎలా చేయాలంటే..? -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications