షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం స్పెషల్ పచ్చడి..ఒకసారి ట్రై చెయ్యండి!
మనకు దొరికే అనేక ఆకుకూరలతోను, కూరగాయలతోను రకరకాల పచ్చళ్లు తయారు చేసుకుని తింటూ ఉంటాము. అయితే షుగర్ పేషెంట్లకు షుగర్ ను కంట్రోల్ చేసే ఇన్సులిన్ ఆకులతో కూడా పచ్చడి చేయొచ్చు. ఈ పచ్చడి తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్సులిన్ ఆకుల పచ్చడిని షుగర్ బాధితులు మాత్రమే తింటే మంచిది.
ఇన్సులిన్ ఆకుల పచ్చడి
సహజంగా ఇన్సులిన్ ఆకులను షుగర్ పేషెంట్లు పరగడుపున ఒక రెండు ఆకులు తింటారని, అలా తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుందని చెబుతారు. అయితే కేవలం ఆకులను తినడం బదులు, ఇన్సులిన్ ఆకుల పచ్చడిని చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇన్సులిన్ ఆకుల పచ్చడి ఎలా తయారు చేస్తారో చూద్దాం.

ఇన్సులిన్ ఆకుల పచ్చడి తయారీ కి కావలసిన పదార్థాలు
ఇన్సులిన్ ఆకులు- 15
పచ్చిమిరపకాయలు- నాలుగు
ఎండు మిరపకాయలు- రెండు
ఉప్పు- రుచికి తగినంత
జీలకర్ర- ఒక టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు- మూడు
చింతపండు- చిన్న ఉసిరికాయంత
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
పోపు గింజలు- ఒక స్పూన్
కరివేపాకు- రెండు రెమ్మలు
తయారీ విధానం
ఇన్సులిన్ ఆకులను శుభ్రంగా కడుక్కొని, పచ్చిమిరపకాయలు తొడిమె తీసుకుని, స్టవ్ వెలిగించి స్టౌ పైన పాన్ పెట్టి ఆ పాన్లో నూనె పోసి, నూనె వేడి అయిన తర్వాత ఇన్సులిన్ ఆకులు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఎండు మిరపకాయలను వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత రోట్లో ఈ మిశ్రమాన్ని వేసి రుచికి తగినంత ఉప్పును. జీలకర్రను. వెల్లుల్లి రెబ్బలను, కొద్దిగా కరివేపాకును కూడా అందులో యాడ్ చేసి మెత్తగా నూరుకోవాలి.
డయాబెటిస్ బాధితులకు బెస్ట్ పచ్చడి
మరీ పచ్చడి గట్టిగా ఉంటే కొద్దిగా నీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చడి మెత్తగా నూరిన తర్వాత దీనిని స్టవ్ పైన చిన్న పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేసి పోపు గింజలు వేసి అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి, ఆ పోపును పచ్చడిలో కలుపుకోవాలి. ఈ పచ్చడి డయాబెటిస్ బాధితులకు చాలా మంచిది. ఇది వీరి షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.
వీరు తినకుండా ఉంటేనే మంచిది
అయితే డయాబెటిస్ లేని వారు ఈ పచ్చడిని ఎక్కువ తినకుండా ఉంటేనే మంచిది. షుగర్ తో బాధపడేవారు కూడా ఈ పచ్చడిని పరిమితంగా తినాలి. ఇంకేదైనా అనారోగ్యమున్నా, మరే ఇతర సమస్యలు ఉన్న వైద్యుల సూచన మేరకు మాత్రమే ఈ పచ్చడిని తినాలి.












Click it and Unblock the Notifications