జుట్టు విషయంలో కామన్ గా మనం చేసే తప్పులివే!
అందమైన, పొడవైన , బలమైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మగవాళ్ళకైనా, స్త్రీల కైనా అందాన్ని ఇచ్చేది జుట్టు. అటువంటి జుట్టు విషయంలో చాలామంది కేర్ తీసుకుంటున్నాము అనుకొని చేయకూడని కొన్ని పొరపాట్లు చేస్తారు. దానివల్ల జుట్టు పాడవుతుంది. అసలు జుట్టు విషయంలో మనం మనకు తెలియకుండా చేసే పొరపాట్లు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
జుట్టు విషయంలో సాధారణంగా చేసే పొరబాట్లు ఇవే
జుట్టు విషయంలో చాలామంది సాధారణంగా కొన్ని తప్పులు చేస్తారు. అటువంటి వాటిలో ఒకటి తరచూ తలస్నానం చేయడం. తరచూ తలస్నానం చేయడం జుట్టు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. వారానికి రెండు సార్లు మాత్రమే తలస్నానం చేయాలి. ఇక చాలామంది జుట్టుకు నూనె రాస్తున్నాం, చక్కగా దువ్వు కుంటున్నాం పెరుగుతుంది అని భావిస్తారు. కానీ తలపైన స్కాల్ప్ గురించి మాత్రం ఆలోచించరు.

జుట్టు ఆరోగ్యం ఈ పనులతో పాడు అవుతుంది
స్కాల్ప్ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. స్కాల్ప్ హెల్తీగా ఉందా లేదా? తలచర్మం ఎలా ఉంటే ఆరోగ్యంగా జుట్టు ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలి. దీనిని నిర్లక్ష్యం చేస్తే జుట్టు ఆరోగ్యం పాడవుతుంది. చాలామంది చాలా టైట్ గా జడ వేసుకుంటారు. కానీ ఇది కూడా జుట్టు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. చాలామంది తలస్నానం చేసిన తర్వాత జుట్టును దువ్వుతారు. అలా చేస్తే జుట్టు చాలా ఎక్కువగా తెగిపోతుంది.
ఇలా చేస్తే మీ జుట్టు నాశనం
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా జుట్టుని స్టైలిష్ గా తయారు చేయడానికి హెయిర్ స్ట్రైట్నర్ తో హీట్ చేస్తారు. ఇది కూడా జుట్టు ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. కొంతమంది తడి జుట్టుతో నిద్రపోతారు లేదా అతిగా జుట్టును దువ్వుతూ ఉంటారు. ఇది కూడా మనం జుట్టు విషయంలో చేసే తప్పు. వీటి వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది.అంతేకాదు బాగా వేడి నీళ్లతో తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది.
ఈ విషయాలలో జాగ్రత్త లేకుంటే జుట్టు ఊడిపోతుంది
మార్కెట్లో దొరికే వివిధ బ్రాండ్లకు సంబంధించిన ప్రోడక్ట్ వివరాలు పూర్తిగా తెలుసుకోకుండా వినియోగిస్తే కూడా జుట్టు రాలిపోతుంది . కొందరు జుట్టు ఆరోగ్యం కోసం వివిధ రసాయన చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు. దీని వల్ల కూడా జుట్టు ఆరోగ్యం పాడవుతుంది. జుట్టు రాలిపోతుంది. షాంపుని ఇష్టం వచ్చినట్టుగా వాడడం, కండిషనర్ వాడకపోవడం వంటి కారణాలతో కూడా జుట్టు రాలిపోతుంది.
జుట్టు విషయంలో ఇలా చేస్తే నష్టం
కొంతమంది జుట్టును ఆరబెట్టుకోవాలని. టవల్ తో గట్టిగా రుద్దుతూ జుట్టును ఆరబెట్టుకుంటారు. అలా టవల్ తో జుట్టును గట్టిగా రుద్దడం వల్ల జుట్టు చిట్లిపోతుంది. ఫలితంగా జుట్టు తెగిపోతుంది. ఇక విపరీతమైన ఎండలో తిరిగితే కూడా జుట్టు రాలిపోతుంది. ఇవన్నీ మనం సాధారణంగా, సహజంగా తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు. కాబట్టి జుట్టు ఆరోగ్యంగా అందంగా పెరగాలంటే ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు.
-
"గుత్తి వంకాయ కారం" టేస్టే వేరబ్బా.. ఎప్పుడైనా ట్రై చేశారా..? -
షుగర్ పేషెంట్లకు మతిమరపు! పరిశోధనలో తేలిన నగ్న సత్యాలు.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
రెస్టారెంట్ స్టైల్ "జీడిపప్పు చికెన్ పకోడీ" ఇలా చేస్తే అదరహో !! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications