ఈ ఆరింట్లో ఏ ఒక్క లక్షణం కనిపించినా.. డాక్టర్ వద్దకు పరుగులు పెట్టాల్సిందే

పంటి నొప్పి, చిగుళ్ల నుండి రక్తం కారడం లేదా దీర్ఘకాలిక దుర్వాసన దంత సమస్యలు మాత్రమే కావు. ఈ ఆరు నోటి సంబంధిత లక్షణాలు తీవ్ర అనారోగ్య సమస్యలకు సంకేతాలుగా ఉండొచ్చు. నోరు.. మొత్తం ఆరోగ్యానికి ఓ అద్దం వంటిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

ఓ ఆరోగ్యకరమైన వ్యక్తి నోరు ఆత్మవిశ్వాసంతో కూడిన చిరునవ్వును ఇవ్వడానికే పరిమితం కాదు.. అది మీ మొత్తం శరీర నిర్మాణం, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆహారాన్ని తీసుకోవడం మొదలుకుని అంటువ్యాధులను నిరోధించడం వరకు.. నోటి ఆరోగ్యం మీ శరీరంలోని మిగిలిన భాగాలతో ముడిపడి ఉంటుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

తీవ్రమైన దంత నొప్పి..

దంత నొప్పి ఎక్కువ కాలం కొనసాగినా లేదా దానిపై ఎనామిల్ చెదిరిపోయినా.. ధృడత్వం తగ్గినా ఆరోగ్యపరంగా ఏదో ఇబ్బంది ఉందనే నిర్ధారణకు రావొచ్చు. వేడి లేదా చల్లని పదార్థాలు తీసుకున్నప్పుడు నొప్పి కలగడం, జివ్వుమని లాగడం వంటివి అనారోగ్య లక్షణాలకు పునాదులుగా చెప్పుకోవచ్చు. ఈ లక్షణాలు పండ్ల కుదురు, ఎనామిల్ అరుగుదలకు దారి తీస్తాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే రూట్ కెనాల్ అవసరమయ్యే పరిస్థితి కూడా తలెత్తుతుంది. సకాలంలో చికిత్స మీ దంతాలను కాపాడతాయి.

చిగుళ్ల నుండి రక్తం కారడం లేదా వాపు..

బ్రష్ చేస్తున్నప్పుడు రక్తం కనిపించడం చిన్న విషయం అనిపించినా, ఇది సాధారణంగా చిగుళ్ల వాపు లేదా జింజివైటిస్ దారి తీస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది పీరియాడోంటైటిస్ అనే చిగుళ్ల వ్యాధిగా మారవచ్చు. దంతాలను బలంగా ఉంచడానికి ఉపయోగపడే ఎముక, కణజాలాలను దెబ్బతీసే మరింత తీవ్రమైన చిగుళ్ల వ్యాధి. వాపు, సున్నితమైన లేదా రక్తస్రావం అయ్యే చిగుళ్లను ఎప్పుడూ విస్మరించకూడదు, ఎందుకంటే అవి మీ నోటి మరియు శరీర ఆరోగ్యం రెండింటినీ దెబ్బతీయగలవు.

నోటి దుర్వాసన..

నోటి దుర్వాసన లేదా హాలిటోసిస్ ఇబ్బందికరమైనదే కాదు.. నోటి సమస్యలకూ సంకేతం. సరైన నోటి పరిశుభ్రత లేకపోవడం వల్ల ఆహార కణాలు పేరుకుపోతాయి. ఇది దుర్వాసన వెలువడటానికి కారణం అయ్యే బ్యాక్టీరియాకు నిలయంగా మారుతాయి. బ్రషింగ్ లేదా మౌత్ వాష్ తో మెరుగుపడని ఈ దుర్వాసన చిగుళ్ల వ్యాధి, కుహరాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది.

దవడ నొప్పి..

నమిలేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు దవడలో అసౌకర్యంగా అనిపిస్తే అది టెంపొరోమాండిబులర్ జాయింట్ రుగ్మతలకు సంబంధించినవి కావచ్చు. డెంటల్ టెర్మనాలజీలో దీన్ని టీఎంజే అని పిలుస్తారు. చికిత్స చేయకుండా వదిలేస్తే ఈ TMJ సమస్యలు అధికమౌతాయి. నొప్పిని తగ్గించడానికి డెంటిస్టులు బైట్ అడ్జస్ట్మెంట్స్ లేదా నైట్ గార్డ్స్ వంటి చికిత్సలను సిఫారసు చేస్తారు.

పొడి నోరు..

కొన్ని రకాల హానికారక ఆమ్లాలను నివారించడం, బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా మీ నోటిని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. లాలాజలం. మందులు లేదా ఇతర వ్యాధుల వల్ల తరచుగా నోరు పొడిబారుతుంటే అది అనారోగ్యకారకమే. పొడి నోరు, దంత క్షయం, పంటి కుదుళ్లు అంటువ్యాధుల ప్రమాదాన్ని ఇది పెంచుతుంది. పగిలిన పెదవులు, నోటి మూలల్లో పుండ్లు, గరుకైన నాలుక, ఆహార పదార్థాలను మింగడంలో ఇబ్బంది కలిగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

నోటి పుండ్లు..

అప్పుడప్పుడు పుండ్లు సాధారణం, కానీ నిరంతరంగా అవి వస్తోండటం లేదా నయం కాని గాయాలు, అంటువ్యాధులు లేదా, కొన్ని అరుదైన సందర్భాల్లో అవి.. నోటి క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీయవచ్చు. ఒక పుండు రెండు వారాలకు మించి ఉంటే డాక్టర్ల సలహా తీసుకోవలసిన సమయం ఆసన్నమైనట్టే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+